భారత్-వెస్టిండీస్‌ల మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ వికెట్ల పతనం కొనసాగుతోంది. టాప్ ఆర్డర్ కుదేలైంది. మ్యాచ్‌లో భాగంగా విండీస్ ఐదో వికెట్ చేజార్చుకుంది. 38.5ఓవర్లో కుల్‌దీప్ వేసిన బంతిని సునిల్ ఆంబ్రిస్(18; 26 బంతుల్లో, 3×4) రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులో రోస్టన్ చేజ్(7), డోరిచ్(0) ఉన్నారు. ప్రస్తుతం విండీస్ స్కోర్ 113/5.