విండీస్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే 56 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కేవలం 6 పరుగుల వద్దే రెండు వికెట్ల కోల్పోయింది. ఉమేష్ యాదవ్, అశ్విన్ లు చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 311 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 367 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆటకు నేడు మూడో రోజు.
విండీస్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు
