ఓ మనిషి ఏంటి భయం…కరోన ను తరిమేసే శక్తి నీకుంది….!!

0
45

ఓయ్…మనిషి
ఏంటి… భయపడుతున్నావ్..?
ఎందుకంత వణుకుతున్నావ్..?
ఇప్పుడేం జరిగిందని..ఈ యుద్ధానికే జంకుతున్నావా?
ఆది మానవుని నుండి,
ఆధునిక మానవుని వరకు
ఎలా వచ్చావ్..?
ఆకులతో “ఒంటిని” కప్పుకున్నావ్..
ఆలోచనతో “ఇంటిని” కట్టుకున్నావ్..
వేట తో “ఆకలి” తీర్చుకున్నావ్..
ఆట తో ” ఆనంద” పర్చుకున్నావ్..
ప్రపంచమంతా సంచరించావ్..
పంచభూతాలను వశపరుచుకున్నావ్..
సృష్టి మనుగడ అర్థం చేసుకున్నావ్..
నిన్ను నీవు సృష్టించుకున్నావ్..
కాలం తో పాటు కలిసి ప్రయాణించావ్..
తరం తో పాటు “తలరాత” మార్చుకున్నావ్..
నలు దిక్కులా నీ “ఉనికి” ని చాటావ్..
నవ సమాజాన్ని నిర్మించావ్..
“అభివృద్ధి” ని వృద్ధి చేస్తూ,
అనంత విశ్వంలో కి అడుగు పెట్టావ్..
భూ గ్రహాన్ని పాలిస్తూ..
పక్క గ్రహాలకి గాలం వేస్తున్నావ్..
ఇంత చేసిన నువ్ వింతగా ప్రవర్తిస్తున్నావ్!!
నువ్వు చూడని ” జననాలా” ?
నీకు తెలియని “మరణాలా” ?
నువ్వు రాయని “చరిత్రలా” ?
నువ్వు చెయ్యని “పోరాటాలా” ?
యుద్ధం ఎప్పుడూ ఉంటుంది..
కానీ చేసే పద్ధతి మారుతుంది..
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కోసం,
కదనరంగంలో కాలు దువ్వాల్సిన పనిలేదు,
కత్తులు, బళ్ళాలు అవసరం లేదు,
తుపాకులు,అణుబాంబులు అసలే వద్దు,
ఇది అంతర్యుద్ధం..
చేతికి “శానిటైజర్”..
మూతికి “మాస్క్” రెండే ఆయుధాలు
ఇంట్లో కూర్చునే యుద్ధం మొదలుపెట్టు..
సహానంతో సమరశంఖం పూరించు..
నీ ఓపికతో శత్రువుకి ఆయాసం తెప్పించు..
వివేకంతో వెన్నుపోటు పొడువు..
ధైర్యంతో దాడి చేయు..
భయాన్ని వదిలేయ్ అది నిన్ను హరిస్తుంది..
విజయంపై నమ్మకం ఉంచు అది నిన్ను వరిస్తుంది.🌹….. …కరోనా వచ్చిన వారందరికీ ఒక విజ్ఞప్తి ,కరోనా వచ్చినా మీరు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉంటే కరోనా మీ వెంట్రుక కూడా పీకలేరు.ధైర్యం అనే మందు కరోనాకు బ్రహ్మాండంగా పని చేస్తుంది ,అధైర్య పడితే కరోనా మిమ్మల్ని వెంటాడుతుంది ,దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి పదిమందికి ధైర్యం చెప్పండి ,ధైర్యంగా ఉందాం ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడుదాం …..