Site icon Sri Yadadri Vaibhavam

కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయట పడుతున్నాం.. మళ్ళీ మంచి రోజులు

ప్రతీ ఒక్కరికీ కరోనా ఉండే ఉంటుంది అనుకుంటున్న తరుణంలో.. అమెరికా శాస్త్రవేత్తలు ఒక మరణశిక్ష పడిన నేరస్తుని శరీరం మీద పరిశోధనలు చేయాలని తలచారు. సదరు వ్యక్తి తనను ఉరి తీయడానికి బదులుగా త్రాచు పాము కాటుతో చంపాలని కోరాడు. అతని కోరిక మేరకు పెద్ద త్రాచు పాముని తెప్పించారు అతని ఎదురుగా పామును ఉంచి కళ్ళకు గట్టిగా గంతలు కట్టారు. ఆ తరవాత అతనిని పాము కాటుకు గురిచేయలేదు. డానికి బదులుగా ఒక పరిశుభ్రమైన సూదితో అతని శరీరంపై గుచ్చారు. ఆశ్చర్యకరంగా సూది గుచ్చిన రెండు సెకండ్లకే అతను మరణించాడు.

అతని శవపరీక్ష ( post- martem report) పరిశీలించగా ఆతని శరీరంలో పాముకాటు విషం అన్నట్లు తేలింది. డాక్టర్లకు.. శాస్త్రవేత్తలకు ఆ విషం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే ఆ విషం ఆతని శరీరం నుండే ఉత్పత్తి అయింది. అదెలా సాధ్యం!? విషం శరీరంలోకి ఎలా ప్రవేశించింది అని పరిశీలించగా ఆతని శరీరం పాముకాటు అనే మానసిక ఒత్తిడికి గురి కావడంతో అతని శరీరంలోని హార్మోన్లు నుండి ఈ విషం ఉత్పత్తి అయినట్లు తేలింది.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే మన మానసిక స్థితి మీదే అంతా అధారపడి ఉంటుంది. మనం మంచి జరుగుతుందని ఆలోచిస్తే మంచే జరుగుతుంది! చెడు జరుగుతుందని ఆలోచిస్తే చెడే జరుగుతుంది. ధృఢమైన సానుకూల దృక్పథంతో మనం ఉంటే మన జబ్బును తగ్గించే 90% శక్తిని మన శరీరంలోని హార్మోనులే ఉత్పత్తి చేస్తాయి. మనకు జబ్బు నయం కాలేదు అంటే దానికి కారణం మన మనస్సులో కలిగే అపసవ్య ఆలోచనలే! ఇప్పుడు మనిషి తనకు తానే తప్పుడు/వ్యతిరేక
ఆలోచనలతో తన శక్తిని బూడిదపాలు చేసుకుంటున్నాడు. దీన్నిబట్టి మనం ప్రధాన విషయం ఏమిటంటే కరోనా ఆలోచనలు మన హృదయానికి చేరనీయకూడదు!. పసి పిల్లల నుంచి పెద్దల దాకా కరోనా సమయంలో ఇలాంటి వ్యతిరేక ఆలోచనలతోనే ఉన్నారు, అనవసర భయాందోళనలతో దాదాపుగా అందరూ ఉన్నారు. పొరబాటున కూడా గణాంకాల జోలికి పోవద్దు. కరోనా కారణంగా చనిపోయిన వారు కేవలం కరోనా వల్ల కాదు.. వారికి ఉన్న ఇతర వ్యాధుల వల్ల కూడా అన్న సంగతి గుర్తెరగాలి! ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవ్వరూ ఇంటి దగ్గర చనిపోలేదు.. హాస్పిటల్ లో మాత్రమే చనిపోయారు! అంటే హాస్పిటల్ వాతావరణం సృష్టించే ప్రతికూల ప్రభావం మనస్సును పాడు చెయ్యడం వల్లనే! కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండండి మంచి ఆలోచనలు మాత్రమే చేయండి

1) కరోనా పట్ల మనకున్న అవగాహన చాలు. ఇంకా కరోనాకు సంబంధించి వార్తలు వినవద్దు.. చూడవద్దు.
2) మరింత సమాచారం కోసం అన్వేషణ తక్షణం ఆపేయండి! ఎందుకంటె ఇది మీ మానసిక స్థైర్యాన్ని బలహీన పరుస్తోంది.
3) కరోనా వైరస్ కు సంబంధించిన సలహాలు ఇతరులకు ఇవ్వొద్దు! ఎందుకంటే అందరి మానసిక సామర్థ్యం ఒకేలా ఉండదు. మీ మాటల వల్ల కొందరు డిప్రెషన్ కు లోనవుతారు!
4) సంగీతాన్ని ఆస్వాదించండి. భక్తి గీతాలు వినండి. పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలసి హాయిగా గడపండి.
5) తరచూ చేతులు కడగండి కొత్త వ్యక్తులు వస్తే కనీసం మీటరు దూరంలో ఉండి మాట్లాడండి.
6)వైరస్ గురించి అతిగా భయపడే నీలోని ఆలోచనలు వైరస్ మీద పోరాడే నీలోని శక్తినీ, హార్మోన్లను నిర్వీర్యం చేస్తాయి. శారీరకంగా మానసికంగా నీలో ఉన్న శక్తిని
ఇలాంటి ఆలోచనలు దహించి వేస్తాయి.
7) అత్యావశ్యకమైనది, ముఖ్యమైనది ఏమిటంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం త్వరలోనే బయట పడుతున్నాం.. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి.
🙏🙏🙏

Exit mobile version