భువనగిరి ఆంజనేయ స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

0
190

భువనగిరి ప్రతినిధి, ఆగస్టు 24.
భువనగిరి పట్టణం శివారు లోని శ్రీఆంజనేయ స్వామి సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ప్రతిష్టాపన ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు బుధవారం వేద పండితులతో విగ్నేశ్వరపూజ తో అంకురార్పణ జరిగింది. పుణ్యాహవాచనము, మాతృకపూజ , ఋత్వికవరుణం, దీక్ష ధారణ, వాస్తుపూజ , యాగశాల ప్రవేశం, అగ్నిమధనం, జలాధివాసం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, అధ్యక్షుడు జడల ఆనంద్ , కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు క్యాసనూరిమఠం రాజకోటయ్య , కోశాధికారి చింత రాజు, నీల కృష్ణ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాతలు గడ్డం
నరేందర్, శ్రీనివాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు

భువనగిరి శివారులో గల ఆంజనేయ స్వామి వారి ఆలయములో శ్రీరాజ రాజేశ్వరి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరుగుతున్న పూజలు