Site icon Sri Yadadri Vaibhavam

భువనగిరి బైపాస్ రోడ్డులో… అతివేగం యువకుడి ప్రాణం తీసింది

అక్కడికక్కడే మృతి చెందిన కొర్రెముల కు చెందిన మొగుళ్ళ సాయి (19)

అతివేగమే ప్రాణం తీసిందంటున్న పోలీసులు

భువనగిరి ప్రతినిధి ఆగస్టు 24.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ఎల్లమ్మ గుడి సమీపంలో అతివేగంతో యువకుడు ద్విచక్ర వాహనం నడిపి డివైడర్ ను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే

ఘట్కేసర్ మండలము కొర్రెముల గ్రామానికి చెందిన మొగుళ్ళ సాయి (19) భువనగిరి నుండి హైదరాబాద్ వైపు అతి వేగంతో ద్విచక్ర వాహనం పై వెళుతుండగా డివైడర్ ను ఢీకొని మృతి చెందినట్లు ఎస్ ఐ నాగిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి డెడ్ బాడీ ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగిందని అన్నారు.

Exit mobile version