భువనగిరి వీరశివాజీ యూత్ ప్రతిష్ఠించిన దుర్గామాతను దర్శించుకున్న కుంభం

0
70

వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గా మాతని దర్శించుకున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
భువనగిరి పట్టణంలోని మీనానగర్ కాలనీలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి దుర్గా మాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వీరశివాజీ యూత్ అధ్యక్షుడు సూదగాని రాజు అనిల్ కుమార్ రెడ్డిని సత్కరించి అమ్మ వారి ప్రసాదాన్ని అందచేశారు. అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వీర శివాజీ యూత్ సభ్యులు చాలా నియమ నిష్టలతో వైభవంగా అమ్మ వారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేష్, తంగేళ్ళపల్లి రవి కుమార్, సలాలుద్దీన్, జగన్ , పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, వీర శివాజీ యూత్ సభ్యులు కరిపే సురేష్, కరిపే నరేష్, పొత్నక్ సన్నీ,
కుసుమ సాయి తేజ, దేశెట్టి సాయి చరణ్, సచిన్, పట్నం ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.