Site icon Sri Yadadri Vaibhavam

మృత దేహం ద్వారా కరోనా వ్యాప్తి జరగదు.TV9 LIVE లో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ స్పష్టీకరణ

మృత దేహం ద్వారా కరోనా వ్యాప్తి జరగదు
బాధ్యత రాహిత్యంగా ఉన్న వ్యక్తుల ద్వారా మాత్రమే వ్యాప్తి .

స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆగిపోయినట్లు, ప్రాణం పోయిన తర్వాత వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది.

మృత దేహాన్ని మాత్రమె డైరెక్టుగా తాకడం చేయవద్దు

మరణించిన బందు మిత్రులు అనాధ శవాలుగా వారి ఆత్మ ఘోషించవద్దు.

గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరపండి, వారి కుటుంబాలకు అండగా ఉండండి.

కరోనా వైరస్ కేవలం బ్రతికి ఉన్న మనిషిలోని బ్రతికి ఉంటది
చనిపోయిన కొద్దీ గంటలకు నిర్వీర్యం అవుతుంది

మృత దేహాన్ని హైపోక్లోరితే , ఇతర శానిటైజర్ ద్రవంలో తడిపిన వస్రం లేదా బాడీ బాగ్ వాడండి

ఆ నలుగురు మాస్క్ , గ్లోవ్స్ ,పేస్ షెయిల్డ్ ఉంటె పీపీ కిట్ వేసుకుంటే సరిపోతుంది

కుటుంబ సభ్యులు మీద పడి ఏడవొద్దు . ఇంటిలోపట గుమి కుదవద్దు. అందరు ఆరుబయట ఉంటె మంచిది. ముక్యంగా ఇరుకు గదులు ఉన్నవాళ్లు

దహన సంస్కారం తొందరగా చెయ్యండి

దశ దిన కర్మ కుటుంబానికి పరిమితం చేయండి.

ధనిక విద్యావంతులు పాటిస్తున్నారు, కానీ పేద మధ్యతరగతి పూర్తిగా అవగాహనా పెంచుకోలేదు.

మన కల్చర్ లో బందు మిత్రులు పిలిస్తే పోకుండా ఉంటె అవమానంగా భావిస్తారు. ఆ భావనకు ఇది సమయం కాదు.

శుభా కార్యాలకు పోయిన పోకున్న, మరణం సంభవించిన మీ బందు మిత్రుల కుటుంబాలకు ఫోన్ ద్వారా లేదా కోవిద్ నిబంధనలు పాటించి పరామర్శించండి.

ఆర్థికంగా కష్టాలలో ఉన్న మీ బందు మిత్రులకు తక్కువ అయినా కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే అదే పదివేలు.

Exit mobile version