

యాదాద్రి దేవస్తాన ముఖ్య అర్చకులుగా పనిచేసిన గట్టు యాదగిరిస్వామి మంచి పేరు ప్రఖ్యాతులు గడించారని యాదాద్రి దేవస్థానం ఈఓ గీతారెడ్డి అన్నారు.మంగళవారం గట్టు యాదగిరిస్వామి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఆలయములో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్చకత్వం ఎంతో పవిత్రమైనదని కొనియాడారు. అలాంటి పవిత్రమైన వృత్తికి గట్టు యాదగిరిస్వామి వన్నె తెచ్చారన్నారు.ఆలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గజ్వేల్లిరమేష్ బాబు, ఏఈఓలు శ్రావణ్,కృష్ణ, భాస్కర్ తో పాటు గట్టు యాదగిరిస్వామి బంధువులు హాజరయ్యారు. అర్చకులు ఆశీర్వాదం అందజేశారు.
