రక్తదానం చేసిన యువకులను అభినందించిన భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి
రాచకొండ సీపీ మహేష్ భగవత్ పిలుపు మేరకు యువకుల రక్తదానం
రాచకొండ సీపీ పిలుపు మేరకు యువకులు రక్తదానం చేయడం శుభ పరిణామమని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి అన్నారు. కరోన 2nd వేవ్ సమయంలో రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలతో రెడ్ క్రాస్ సొసైటీ కలిపి రాచకొండ కమిషనరేట్ భువనగిరి ఆధ్వర్యంలో రావి భద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు, విద్యావంతులు పోలీస్ సిబ్బంది ఈ రక్తదాన శిబిరంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. కరోనా సమయంలో రక్త నిల్వలు తక్కువగా ఉండడంతో ముఖ్యంగా మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం ఉండటం వారికి రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు జోన్ లలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మంగళవారం భువనగిరిలో, బుధవారం యాదగిరిగుట్టలో, గురువారం చౌటుప్పల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాచకొండ సీపీ పిలుపు మేరకు యువకుల రక్తదాన శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, రక్తదానం చేసిన వారిని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు. ఈ రోజు 93 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ డిసీపీ భజంగరావు, ఏసీపీ శ్రీనివాస రావు, రెడ్ క్రాస్ సోసైటీ బాలాజీ, భువనగిరి టౌన్ సిఐ, భువనగిరి రురల్ సిఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.

