రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు కై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

0
105

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు

👉రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

👉పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

👉 ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

👉హైదరాబాాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతించింది.

👉ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

👉ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.

👉ఈ వైద్య ఆరోగ్య సబ్ కేబినెట్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.

👉దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెళ్లి అధ్యయనం చేసిరావాలని, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

జూన్ 8న జరిగిన కేబినేట్ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్