Site icon Sri Yadadri Vaibhavam

సమర్ధవంతంగా రెండో విడత సమగ్ర ఆరోగ్య సర్వే:హెల్త్ సెక్రెటరీ


అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నా మండలాలను రెండో విడత డోర్ టూ డోర్ సర్వే ద్వారా గుర్తించి బాధితులకు ఐసోలేషన్, కోవిద్ ఓ పి ద్వారా నిరంతరాయంగా చికిత్స అందించడానికి ఆశలు, ఏఎన్ఎంలు డాక్టర్లు నిరంతరంగా పర్యవేక్షించాలని హెల్త్ సెక్రెటరీ
సయ్యద్ ముర్తుజా రిజ్వీ సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు.
బిబినగర్ మండలం ఎంపిడిఓ కార్యాలయంలో పి హెచ్ సి డాక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల కోఆర్డినేటింగ్ అధికారులతో ఏర్పాటు అయిన సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ డోర్ టు డోర్ సర్వే ద్వారా
గుర్తించిన కేసులకు మెడికల్ కిట్లు పంపిణీ చేసి పట్టణాలలో 8 వ రోజు, గ్రామాల్లో ఐదోరోజు సందర్శించి కేసుల తీవ్రతపై ఆశా ,ఏఎన్ఎం డాక్టర్స్ మరియు టీమ్ ద్వారా మండల కో ఆర్డినేటర్ అధికారులు నిరంతరాయంగా పర్యవేక్షించాలని తెలిపారు.
కోవిద్ వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న 54 టీమ్లు బాధితులను ఇంట్లో ఐసోలేషన్ ద్వారా, బయట సంచరించకుండా డాక్టర్ ద్వారా చికిత్స చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని 28 covid సెంటర్లను సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కోవిద్ బాధితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వారికి తగిన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రెండవ సారి హౌస్ టు హౌస్ ద్వార సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు స్పెషలాఫీసర్ చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ మండలం
tangazpalli నందు 13000 ఇళ్లకు నిర్వహించిన సర్వేలో 534 మందిని కరోనా లక్షణాలు గుర్తించగా 46 మందికి పాజిటివ్ రావడంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గుర్తించిన కేసులను నిర్ణీత వ్యవధిలో గుర్తుఇంచాలి

Exit mobile version