Site icon Sri Yadadri Vaibhavam

సీతయ్య బాధ్యతాయుతంగా నడుచుకున్న తీరును పలువురు అభినందిస్తున్నారు.

విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో గ్రామ సర్పంచి గండికోట సీతయ్య అన్నీతానై ఆమెను పూర్తి కరోనా నిబంధనల నడుమ ఆటోలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బుధవారం చేర్పించారు. మహిళ తాను ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతానని చెప్పడంతో అక్కడి నుంచి తానే స్వయంగా కరోనా కిట్‌ ధరించి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో డిశ్ఛార్జి చేయించి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కరోనా బారిన పడిన వారిని చూసేందుకు భయపడుతున్న ప్రస్తుత తరుణంలో గ్రామ ప్రథమ పౌరుడిగా ఉన్న సీతయ్య బాధ్యతాయుతంగా నడుచుకున్న తీరును పలువురు అభినందిస్తున్నారు.

Exit mobile version