స్కూళ్ల రీఓపెనింగ్‌కు హైకోర్టు బ్రేక్‌లు

0
292

తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌కు బ్రేక్‌లు వేసింది హైకోర్టు.. స్కూళ్ల పునఃప్రారంభంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి స్కూళ్లను తెరవాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై వారం రోజుల పాటు స్టే విధించింది..

దీంతో.. రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది..

ఇక, నాలుగు వారాలకు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది.. ఇప్పుడు విద్యార్థులు స్కూల్‌కి రాకపోతే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

81NewsTelugu