🔊💰హైదరాబాద్‌ యువతికి వార్షిక వేతనం 2 కోట్లు…అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగం…వర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపిక

0
25

🍥హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ క్లూస్‌ టీమ్‌ విభాగంలో సైంటిస్ట్‌ డాక్టర్‌ వెంకన్న కుమార్తె దీప్తి ఈ ఘనత సాధించారు. 2019లో దీప్తి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. వర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఎంఎస్‌ (కంప్యూటర్స్‌) ఈ నెల 2న పూర్తిచేశారు. కోర్సు పూర్తి కాకముందే వర్సిటీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగాయి. గోల్డ్‌మన్‌ సాక్స్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఆమె మైక్రోసాఫ్ట్‌ వైపు మొగ్గుచూపారు.సాధారణంగా ఎంఎస్‌ విద్యార్థులకు న్యూగ్రేడ్‌ పొజిషన్‌ కింద కంపెనీలు ఆఫర్‌చేస్తుంటాయి. అందుకు భిన్నంగా దీప్తి ఎస్‌డీఈ (సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ ఇంజినీర్‌) గ్రేడ్‌-2కు ఎంపికయ్యారు. 300 మంది విద్యార్థుల్లో అత్యధిక జీతంతో దీప్తి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ నెల 17న సియాటెల్‌ నగరంలోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు తీసుకోబోతున్నదని దీప్తి తండ్రి వెంకన్న ‘నమస్తే’కు తెలిపారు.