కరోన-జయగీతం-4.

0
109

              ****

చేయకు బేరం మానవ జీవితాల
తీయకు ప్రాణం కష్టపు కరోన వేళ.

ప్రాణమిచ్చు చిరు సూదుల దాచుటేల…
వేల వేల రూపాయలకమ్ముటేల.,

టీకాలను లేవనుటేల…పలుకుబడుల..
పైరవీల ఇచ్చుటేల.

మందులేని సూదిగుచ్చి మాయంచేయొద్దు…
నమ్మివచ్చు జీవుల ప్రాణాలను
గాలిలోన కలుపవద్దు.

నాల్గు తరాలకున్నకూడ..
చాలక..,నకిలీచేయకు సూదుల.

శాశ్వత నిద్రకు పంపకు..,
పరుపు కుట్టి .. , పారేసిన మాస్కులతో.

దాయకు బ్రతుకు నిలుపు
వాయు సిలిండరుల.

లేవనకు గదులు…
పేదకు దవఖానల.

చెల్లవనుచు భీమాలను…
జీవితాల తెల్లారనిస్తారా..!?

అదనుచూచి లక్షల లక్షల గుంజకు…
వైద్యం వ్యాపారంగా చేయకు.

కరుణ -బాధ్యతలతొ చేసెడి
వైద్యం..వ్యాపారం…సేవలు..
గెలుచునులే..కరోనాను మించి
కలిగెడి రోగాల.

మనిషిపట్ల నువు చూపెడు మాట…మమత
మెచ్చునులే…జనమూ…దైవము నీ ఘణత.

రచన: అనుముల ప్రభాకరాచారి.🙏🏻

                   *****