


వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ శ్రీ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీ నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, శ్రీ రిజ్వి, డీఎంఈ శ్రీ రమేష్ రెడ్డి, ఓఎస్డి శ్రీ గంగాధర్, టి.ఎస్.ఎం.డి.సి ఎండీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూపరిండెంట్ శ్రీ చంద్ర శేఖర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాదికరులు, సీపీ శ్రీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు.
As part of the Warangal visit, Chief Minister Sri K. Chandrashekar Rao on Friday reached MGM Hospital in Warangal at 12.45 PM and went straight to the ICU ward where Covid patients are admitted, getting treatment and inquired about their well being. He enquired about the treatment that is being given to them. He spoke to the patients there and asked them not to worry or entertain any fear about Covid. The patient from Matte Wada Venkatachari told the CM that he is getting better medical treatment. He raised slogans such as KCR Zindabad and KCR is my total life. The CM went to each Bed and spoke to the patients there and asked them about the treatment they are getting. Later, the CM visited the General ward and interacted with the patients there. He went around the MGM Hospital and inspected the facilities available there. He also spoke with the Doctors and asked them about the medical facilities and the treatment given to the patients. The CM also enquired about the problems faced by the medical staff. The CM instructed the medical and health department senior officials there to provide all the required facilities to the patients whatever may be the funds required for that.
Ministers Sri E Dayakar Rao, Ms. Satyavathi Rathod, Warangal east MLA Sri Nannapuneni Ravinder, Warangal West MLA Sri Dasyam Vinay Bhaskar, Mayor Ms. Gundu Sudharani, Chief Secretary Sri Somesh Kumar, Principal Secretary (Medical and Health) Sri S.A.M. Rizvi, DME Sri Ramesh Reddy, CM OSD Sri Gangadhar, TSMSIDC MD Sri Chandrashekhar Reddy, MGM Superintendent Sri Chandrashekhar, Medical and Health Senior Officials, CP Sri Tarun Joshi, several district leaders have accompanied the CM.