కల్వకుంట్ల కాసిం రజ్వీ గా మారిన కేసీఆర్. దాసోజు శ్రావణ్

0
55


1.కల్వకుంట్ల కాసిం రజ్వీ గా మారిన కేసీఆర్. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్.. కేసీఆర్ సర్కార్ ఉన్మాద పాలనుకు నిదర్శనం. ప్రశ్నించే గొంతుకని నొక్కేయాలని చూస్తే ప్రజలే తొక్కేస్తారు: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ హెచ్చరిక.

  1. గులాబి పార్టీకి గులామ్ లా మారిన తెలంగాణ పోలీసులు.. సిగ్గుపడాలి. తప్పుని ప్రశ్నించడమే రఘు చేసిన తప్పా ? ఆదిపత్యం, అహంకారం, అణిచివేత, అవినీతి అనే నాలుగు స్తంభాల పై టీఆర్ఎస్ పాలన సాగుతుంది.
  2. సోషల్ మీడియాలో రఘు కిడ్నాప్ అని రావడంతో భయపడి అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. వార్త రాకుంటే రఘుని ఏం చేసేవారో.. ప్రశ్నించే గొంతుకని నొక్కేస్తారా ? పోలీసులు తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.
  3. రఘు పై ఎఫ్ఐఆర్ హాస్యస్పదం. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసిన తీరుకు సిగ్గుపడాలి. ఒక జర్నలిస్ట్ చెప్పిన మాట విని ఒక జాతీయ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ దాడి చేస్తాడా ? దాడి చేసిన బండి సంజయ్ ని వదిలేసి .. రఘుని ఎందుకు అరెస్ట్ చేశారు ? బండి సంజయ్ అంటే భయమా ?

04-06. 2021

”ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేడు ఒక ఉన్మాద పార్టీకి మారింది. ఆ ఉన్మాద చర్యల్లో బాగంగానే ప్రముఖ జర్నలిస్ట్ రఘుని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచికత్వాన్ని చాటుకుంది” అని ధ్వజమెత్తారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖడించిన దాసోజు.. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు .. పోలీసులు మాటు వేసి, ముసుగుతో వచ్చి, ఒక టెర్రరిస్ట్ ని అదుపులోకి తీసుకున్నట్లు జర్నలిస్ట్ రఘు ని కిడ్నాప్ చేయడం కేసీఆర్ నియంత పాలనుకు అద్దం పడుతుంది. ఇలాంటి చర్యకు పూనుకున్న పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలి” అని మండిపడ్డారు దాసోజు.

”తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తి రఘు. వెనుకబడిన తరగతి నుండి వచ్చిన చురుకైన జర్నలిస్ట్. నిజాయితీగా వ్యవహరిస్తూ ఒక సోషల్ సోల్జర్ గా మీడియాలో సేవలు అందిస్తున్న రఘుని శారీరిక హింసకి గురి చేస్తూ కాళ్ళు చేతులు కట్టేసి జీపులో పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఉన్మాద పాలనుకు నిదర్శనం. ఆదిపత్యం, అహంకారం, అణిచివేత, అవినీతి అనే నాలుగు స్తంభాల పై టీఆర్ఎస్ పాలన సాగుతుంది. ప్రశ్నించే గొంతుకని తన ధన, అధికార మదంతో నొక్కేయాలని చూస్తుంది. దీనికి నిదర్శనమే రఘు అక్రమ అరెస్ట్” అని వెల్లడించారు దాసోజు.

”జర్నలిస్ట్ రఘుది అరెస్ట్ కూడా కాదు. దాడి. ఉదయం తొమ్మిదిన్నరకు చికెన్ తీసుకురావడానికి ఇంటి నుండి బయటికి వచ్చాడు రఘు. 1.30కి రఘు ఇంటికి వచ్చిన పోలీసులు 12.30కి అరెస్ట్ చేశామని నోటీసులు ఇచ్చారు. ఈ మధ్యలో రఘుని కిడ్నాప్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భయపడి అరెస్ట్ చేశామని నోటీసులు ఇచ్చారు. ఒకవేళ సోషల్ మీడియాలో వార్త రాకుండా వుంటే రఘుని ఏం చేసేవారో.. అసలు పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా వుండటం ప్రజస్వామ్యానికి మాయని మచ్చ. అసలు రాష్ట్రంలో పోలీసులు వున్నారా ? మీరంతా పోలీసులా ? లేదా గులాబి పార్టీకి బానిసలా ? కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, అక్రమ ఆరోపణలు ఎదురుకుంటున్న సైది రెడ్డి చెప్పినట్లు వింటారా ? ప్రశ్నించే గొంతుకనే తొక్కేస్తారా ? అధికారం శాశ్వతం కాదు. పెద్దపెద్ద నియంతలు మట్టిలో కలిసిపోయారు. ప్రశ్నించే గొంతుకని నొక్కేయాలని చూస్తే ప్రజలే తొక్కేస్తారు ” అని హెచ్చరించారు దాసోజు.

”రఘు అరెస్ట్ వ్యక్తి అరెస్ట్ కాదు .. స్వేఛ్చకు సంకెళ్ళుగా భావించాలి. భావ ప్రకటన స్వేఛ్చని కాలరాసినట్లు. కేసీఆర్, కేసీఆర్ కి తొత్తులుగా మారిన పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చైతన్య వంతమైన సమాజం. రజాకార్లని తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ ఈ గడ్డకుంది. ఒక్కసారి ఒక్కడి ప్రజలు తిరగబడితే.. టీఆర్ఎస్ అధినాయకత్వం.. ఈ ప్రాంతం వదిలివెళ్ళాల్సివుంటుంది” అని హెచ్చరించారు దాసోజు.

”రఘుని అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే షోయబ్ ఉల్లాఖాన్ గుర్తుకు వచ్చారు. ఆనాడు నిజాంకి వ్యతిరేకింగా వార్తలు రాసినందుకు అక్కసుతో షోయబ్ ఉల్లాఖాన్ చేతులని కాసిం రజ్వీ నరికాడు. ఈవాళ కేసీఆర్ కూడా కాసిం రజ్వీ కంటే అద్వానంగా తయారయ్యారు. కల్వకుంట్ల కాసిం రజ్వీ గా వ్యవహరిస్తున్నారు. మీడియాని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు.

”తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడలేదు. కానీ నేడు సొంత రాష్ట్రంలోనే రక్షణ కరువైయింది. టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు పాల్పడి వినకపొతే ఇలా కిడ్నాపులు చేయించి భాయోత్పాతలు సృష్టిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంద్ర కక్ష రాజకీయాలు , ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకవుండవు ప్రశాతంగా బ్రతకొచ్చని భావించాం. కానీ ఈవాళ కేసీఆర్ ఆహంకార ఆధిపత్య పాలనలో మళ్ళీ ఫ్యాక్షన్ , కక్ష సాదింపు రాజకీయాలని చూస్తున్నా. తప్పుని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.

”పార్టీలని బెదిరించారు, నాయకులని బెదిరించారు. ఓటర్లని ప్రలోభాలకు గురి చేశారు. మీడియా సంస్థలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆఖరికి న్యాయంగా పని చేసే జర్నలిస్టులని కూడా పని చేయనువ్వకుండా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. ప్రశ్నిస్తే గొంతుకని నోక్కేస్తామనే సంకేతాలు పంపుతున్నారు కేసీఆర్. చివరికి సోషల్ మీడియాని కూడా బెదిరించి , అందులో న్యాయంగా మాట్లాడే జర్నలిస్టులపై ఇలా దాడులు చేయడం దుర్మార్గం” అని విమర్శించారు దాసోజు.

” రఘు పై ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే.. 2/7/2021న హుజూర్ నగర్ నియోజికవర్గం చెందిన గుర్రంపోడు తాండలో అక్కడి ఎమ్మెల్యే సైది రెడ్డి గిరుజనులకు సంబధించిన భూములు కబ్జా చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దిన్ని అనేక మీడియా సంస్థలు కవర్ చేశాయి. రఘు కూడా అక్కడి వెళ్లి కవర్ చేశాడు. అక్కడి బిజెపికి చెందిన కాన్వాయ్ వచ్చింది. అందులో బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ వున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ వెళ్తున్నారు కాబట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాస్పద భూమిలో ఓ ఐరెన్ షెడ్ వుంది. ఆ ఐరెన్ షెడ్ పై దాడి జరుగుతుందని పోలీసులు ముందస్తు సమాచారం వుందట. కాన్వాయ్ ఐరెన్ షెడ్ దగ్గరికి వచ్చేటప్పుడు.. జర్నలిస్టు రఘు కాన్వాయ్ కి అడ్డంగావెళ్లి.. బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు చెవిలో ఎదో చెప్పాడట. ఐరెన్ షెడ్ ని చూపించాడట. దాంతో బండి సంజయ్ మిగతా కార్యకర్తలు వెళ్లి దానిపై దాడి చేశారట. అందులో పోలీసులకు గాయాలయ్యాట. ఇదీ రఘుపై నమోదైన ఎఫ్ఐఆర్.

ఇలాంటి ఎఫ్ఐఆర్ సృష్టించిన పోలీసులు నిజంగా సిగ్గుపడాలి. ఎల్ కేజీ పిల్లాడు సైతం నమ్మేలా లేదు ఈ ఎఫ్ఐఆర్. ఒక జర్నలిస్ట్ చెవిలో ఎదో చెబితే ఆ మాటని పట్టుకొని ఓ జాతీయ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, వాళ్ళ బలగం వెళ్లి దాడి చేస్తారా ? అసలు పోలీసులకు సిగ్గుందా? ఇలా ఎఫ్ఐఆర్ రాస్తారా ? ఇంతకీ ఎఫ్ఐఆర్ రాసింది రఘు మీద లేదా బండి సంజయ్ మీదా? దాడి చేసిన బండి సంజయ్ ని వదిలేసి రఘుని ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”ఎఫ్ఐఆర్ లో 21మంది పై కేసు పెట్టారు. ఇందులో పేరున్న బిజెపి నాయకులంతా వున్నారు. ఈ ఎఫ్ఐఆర్ A19 జర్నలిస్ట్ రఘు. కానీ విచిత్రం ఏమిటంటే దాడి చేసిన బండి సంజయ్ A 20, రఘునందన్ రావు A21. అసలు పోలీసులకు సిగ్గు శరం ఏమీ లేవు. అన్నం కాదు గడ్డి తిని ఎఫ్ఐర్ రాసినట్లు వుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం దాడికి సూత్రదారి రఘు అయినప్పుడు అతని పేరు A1లో ఎందుకు లేదు ? మిగతా వారందరిని వదిలేసి కేవలం A19ని ఎందుకు అరెస్ట్ చేశారు ? దాడి చేసిన బండి సంజయ్, రఘునందన్ రావు ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బండి సంజయ్ అంటే భయమా ? లేదా రఘుని టార్గెట్ చేసి మీడియాని భయపెట్టె ప్రయత్నం చేస్తున్నారా ? ఇంత చిల్లర రాజకీయాలా ? ” అని ప్రశ్నించారు దాసోజు.

ప్రజాస్వామ్యానికి ఓ మూలస్థంభం జర్నలిజం అని భావించే పార్టీ కాంగ్రెస్. జర్నలిస్ట్ ఓ సోషల్ సోల్జర్ అని నమ్మే పార్టీ కాంగ్రెస్. రఘుపై జరిగిన దాడిని మరొక్కసారి తీవ్రంగా ఖడింస్తున్నాం. జర్నలిస్టు పక్షాన నిలుస్తాం” అని వెల్లడించారు దాసోజు.
ఈ సందర్భంగా రఘుని అక్రమంగా అరెస్ట్ పై ఆధారాలు చూపుతూ సిసి టీవీ పుటేజ్ ని మీడియాకి ప్రదర్శించారు దాసోజు.