కేసిఆర్ ఫాంహౌస్ నుండి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్ లో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి. సీపీఎం

0
81
  • యండి జహాంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కెసిఆర్ ఫాంహౌస్ నుండి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్ లో నష్టపోతున్న రైతులకు ఇల్లు,భూములు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహాంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    మంగళవారం రోజున తుర్కపల్లి సిపిఎం మండలం ఏడో మహాసభ దేవరకొండ గోవర్ధన్ నగర్ ,తుర్కపల్లిలో జరిగినది.ఈ మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహాంగీర్ మాట్లాడుతూ రైతుల భూముల లో నుంచి రోడ్డు వేస్తున్నప్పుడు కనీసం రైతులకు నోటీసులు అందజేయాలని చట్టం చెబుతున్నప్పటికి ఇవేమీ పాటించకుండ రోడ్డువేశారని విమర్శించారు.సిపియం ప్రజాసంఘాల అద్వర్యంలో పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వం దిగోచ్చి నోటిస్ లు ఇచ్చిందని విమర్శించారు. కెసిఆర్ ఫాం హౌస్ నుండి యాదగిరిగుట్ట వరకు వేస్తున్న రోడ్ లో కొండాపురం, వాసాలమర్రి,తుర్కపల్లి,దత్తాయిపల్లి,వెంకటాపురం గ్రామాలలో రైతులు భూములు ఇళ్లు కోల్పోతున్నారని ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మరియు గుట్ట అభివృద్ధిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
    ఈ మండల మహాసభలో పలు తీర్మానాలు చేయడం జరిగింది.రోడ్డు వెడల్పులో భూములు,ఇల్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలని, తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని,మండల కేంద్రంలో ఉన్న పి ఎస్ సి లో 24గంటల వైద్య సేవలు 20 పడకలతో అందించాలని మహాసభ ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరిగింది.
    ఈ మండల మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడటం జరిగింది. సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య,ఆవుల కళమ్మ,రాపోలు నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో గడ్డమీది నర్సింహ్మ, తూటి వెంకటేశం కడియాల నాగులు, దార్ల దుర్గయ్య, పోతరాజు మాధవి, దేవరకొండ రాజు, గుండెబోయిన వెంకటేశం, చిలువేరు పెంటయ్య,మంత్రి నరసింహ తదితరులు పాల్గొన్నారు