ఖైరతాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చి సకల సౌకర్యాలు కల్పించాలి.డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్

0
119

👉కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా వదిలేసిన టిఆర్ఎస్ సర్కార్ : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు

👉కెసిఆర్ సర్కార్ వెంటనే ఖైరతాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చి పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ కరోనా వైద్యం అందించాలి : దాసోజు

👉కేటీఆర్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఎందుకు ఈ ఆస్పత్రులను పర్యటించి కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం లేదు : శ్రవణ్ దాసోజు

👉కరోనా కష్టకాలంలో అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలు చివరకు పావురాల ఆవాసాలుగా మార్చిన కేసీఆర్ సర్కార్ : శ్రవణ్ దాసోజు

👉వరంగల్ సెంట్రల్ జైల్, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను పక్కనపెట్టి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి పేద ప్రజలకు కరోనా వైద్యం అందించండి : దాసోజు

👉కాంగ్రెస్ లో పులిగా చలామణి అయిన ఏం ఎల్ ఏ దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరి పిల్లిగా మారి గత ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజల కు నాణ్యమైన వైద్యం అందిచడం కోసం ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు?

హైదరాబాద్, మే 22 : ఖైరతాబాద్ లోని బడాగణేష్ వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా శ్రవణ్ దాసోజు గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు,

అనంతరం శ్రవణ్ దాసోజు గారు మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆస్పత్రిని నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలందరికి ప్రభుత్వ వైద్యం అందాలనే ఉద్దేశంతో 2014సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10కోట్ల రూపాయలతో అన్ని రకాల వసతులతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆసుపత్రిని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందిని ధ్వజమెత్తారు.

ఈ ఆసుపత్రి కార్పొరేట్ ఆస్పత్రి తలదన్నేలా అన్ని రకాల వసతులు, వైద్య పరికరాలు, బెడ్లు మరియు అన్నిరకాల వైద్యాలకు డాక్టర్లు, నర్సులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు మాత్రం ఇన్-పేషెంట్ వైద్యం అందడం లేదని, గత సంవత్సరం నుండి కరోనాతో ఖైరతాబాద్ నియోజకవర్గం లోని ఎమ్మెస్ మక్త, బిఎస్ మక్త మరియు ఇంకా అనేక ప్రాంతాల పేద ప్రజలు వైద్యం అందక, బెడ్లు లేక కరోనాతో చనిపోతున్నారని, ఎందుకు టిఆర్ఎస్ ప్రభుత్వ సంవత్సరం నుండి కోవిడ్ ఆసుపత్రిగా మర్చి పేద ప్రజలకు వైద్యం అందించడం లేదని శ్రవణ్ దాసోజు మాట్లాడారు .

అలాగే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ ఎందుకు ఈ ఆసుపత్రిని పర్యటించి కోవిడ్ ఆసుపత్రిగా మార్చకుండా గడ్డి పీకుతున్నారా అని ధ్వజమెత్తారు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసి గత ఏడేళ్లుగా కనీస నిధులు కేటాయించకుండా, వసతులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులను నిరుపయోగంగా మార్చేశారని శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు.

వెంటనే ప్రభుత్యం ఈ ఆస్పత్రిని 100పడకల కోవిడ్ ఆసుపత్రిగా మార్చి పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ వైద్యం అందించాలని శ్రవణ్ దాసోజు గారు ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని డిమాండ్ చేశారు.

అలాగే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిన్న వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పతిని సందర్శించిన సమయంలో వరంగల్ జిల్లా సెంటర్ జైల్ ని కూల్చేసి ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్మిస్తాని మాట్లాడం గమ్మత్తుగా ఉందని తెలిపారు, అలాగే గతంలో ఉస్మానియా ఆస్పతి విషయంలో ఇలానే మాట్లాడారని, ముందు ముఖ్య మంత్రి కెసిఆర్ గారు మోసపూరిత మాటలు మాట్లాడం మాని అన్ని రకాల వసతులు ఉన్న ఈ ప్రభుత్వ ఆస్పత్రులో వెంటనే పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ వైద్యం మొదలుపెట్టి కరోనా వైద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఎందుకు ఈ ఆస్పత్రి పట్ల దృష్టి పెట్టడం లేదని, అలాగే కాంగ్రెస్ లో పులిగా చలామణి అయిన ఏం ఎల్ ఏ దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరి పిల్లిగా మారి గత ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజల కు నాణ్యమైన వైద్యం అందిచడం కోసం ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని ఎందుకు ప్రశ్నించడం లేదని శ్రవణ్ గారు, దానం నాగేందర్ గారిపై ధ్వజమెత్తారు.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా శ్రవణ్ దాసోజు గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారితో పాటుగా టీపీసీసీ సెక్రటరీ మధుకర్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎండీ.షరీఫ్ గారు, ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కమ్మరి వెంకటేష్ గారు, వెంకటేశ్వర నగర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు, బంజారాహిల్స్ డివిజన్ అధ్యక్షులు ధనరాజ్ రాథోడ్ గారు, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షులు నరికేల నరేష్ గారు,జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు కట్టురి రమేష్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ జకీర్ గారు, హరిధర్ గారు,ఎస్సీ సెల్ నాయకులు శ్రీనాథ్ గారు, బుల్లెట్ రాజు గారు & యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.!