
డాక్టర్ చెరుకు సుధాకర్ 60 వ జన్మదిన వేడుకలను సోమవారం భువనగిరి నియోజక వర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TSU జిల్లాఅధ్యక్షులు మెంట ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి పీడీ యాక్టు కేసును అనుభవించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సామాజిక తెలంగాణ ద్వారా మాత్రమే బడుగు, బలహీన వర్గాల వారి బ్రతుకులు బాగుపడతాయనీ తెలంగాణ ఇంటి పార్టీ నీ స్థాపించడం జరిగింది అని తెలిపారు. అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TSU జిల్లా ప్రెసిడెంట్ మెంట ప్రసాద్, అమెర్ సాయి గణేష్ వినీత్ పురుషోత్తం ప్రవీణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.