జన్నన్న సంస్మరణ సభను విజయవంతం చేయాలి: బేజాడీ కుమార్

0
34

యాదగిరిగుట్ట .

సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు, ప్రతిఘటన పోరాట యోధులు కామ్రేడ్ జన్నన్న సంస్మరణ సభ పోస్టల్స్ ను యాదగిరిగుట్ట మండలం సాదువెల్లి గ్రామంలో ఆవిష్కరించడం జరిగినది.


సెప్టెంబర్ 14న సూర్యా పేటలో జరిగే కామ్రేడ్ జన్నుసార్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని CPI(ML) న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ
కామ్రేడ్ జన్నన్న ప్రజలే జీవితంగా,విప్లవమే లక్ష్యంగా ,ప్రజా క్షేమాన్ని కోరి, ప్రజలపై నిరంతరం జరిగే దోపిడీ,పీడనలకు,అవినీతి,అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలను, ఎండగట్టె ప్రజా ఉద్యమాలను నిర్మించిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడు అని, దున్నే వానికే భూమి నినాదంతో ఎర్రజెండా చేతబట్టి ఎన్నో భూపోరాటాలు చేసి, ఎందరో భూస్వాములను ఎదిరించి నిలబడ్డాడనీ, నిత్యం అనారోగ్య సమస్యలు వెంటాడినా అన్నిటినీ పెట్టి ప్రజల జీవితాల మార్పు కోసమే పోరాడాడు.అలాంటి గొప్ప కమ్యూనిస్టుని కోల్పోవడం పార్టీకీ, ప్రజలకూ తీవ్ర నష్టమనీ, అయినా సారు అందించిన పోరాట స్పూర్తితో దోపిడీలేని సమాజం కోసం పోరాడుతూ ముందుకు పోవాలని, 14న జరిగే జెన్ను సార్ సభకు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సబ్-డివిజన్ నాయకులు ఇంజ శ్రీను, డొంకేన నర్సిములు, ఇంజ కుమారస్వామి, P.సత్తయ్య,E.సుధాకర్, M.నర్సయ్య,K.యాదయ్య,D. నర్సింహులు, E.రాజేశ్, M వెంకటేష్, E. నర్సయ్య, S.బాలయ్య ,P. శ్రీను, P చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న బేజాడీ కుమార్, సీపీఐ ఎం ఎల్ పార్టీకి చెందిన నాయకులు