నిర్లక్ష్యం చేస్తే దండన తప్పదంటున్న డీఈఓ

యాదాద్రి-భువనగిరి:
పాఠశాలలు పున ప్రారంభం కాకముందే విద్యా శాఖలో సస్పెన్షన్ల జాతర మొదలైంది. చైతన్య జైని తనదైన శైలిలో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై కొరడా ఝళిపించారు.
పాఠశాలలు పునః ప్రారంభ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను డీఈవో చైతన్య జైని సస్పెన్షన్ చేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆర్ కవిత, భువనగిరి మండలం నాగినేనిపల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ కార్యాలయంలో డీఎల్ఎంపీగా పని చేస్తున్న ఎల్లయ్యపైనా సస్పెన్షన్ వేటు వేశారు.