జీతాలు చెల్లించని టీవీ1 యాజమాన్యం

0
46

తమకు జీతాలు చెల్లించ డంలో అలసత్వం చూపుతూ 1 tv యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని ఉద్యోగులు టీయూడబ్లూజే యూనియన్ ను ఆశ్రయించారు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఇప్పటికే అనేకమార్లు వాయిదాలు వేస్తూ వచ్చిన యాజమాన్యం కొద్దిరోజులుగా కనీసం స్పందించకుండా మొఖం చాటేస్తుందని మాకు న్యాయం చేయాలని కోరుతూ యూనియన్ ను ఆశ్రయించామని ఎలాగైనా యాజమాన్యం తో మాట్లాడి న్యాయం చేయాలని యూనియన్ నేతలను ఉద్యోగులు కోరారు టీయూడబ్లూజే రాష్ట్ర కార్య దర్శి ఆస్కాని మారుతి సాగర్, తెంజు అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ తో ఉద్యోగులు తమ సమస్యలు వివరించగా మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్లూజె అధ్యక్షులు అల్లం నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని యూనియన్ పక్షాన అండగా నిలబడతామని టీయూడబ్లూజె నాయకులు హామీ ఇచ్చారు ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని ధైర్యం కోల్పోవద్దని సూచించారు