
జీవితంలో స్థిరపడే లేదని తీవ్ర నిరాశకు గురైన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యువకుడు ముద్దసాని కరుణాకర్(32) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత శ్రమించినా ఫలితం రావడం లేదని అనుకున్న స్థాయికి వెళ్లలేని పరిస్థితి కలిగినందుకు తీవ్ర నిరాశకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాకర్ సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ. ఎస్. జానకిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. సీఐ జానకిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్య చేసుకున్న ముద్దసాని కరుణాకర్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకిరెడ్డి చెప్పారు.