తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది:- ఈటల

0
28

హైదరాబాద్‌:- తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

తాజాగా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తనకు మద్దతు తెలిపిన ఎన్‌ఆర్‌ఐలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆత్మ గౌరవ ఉద్యమం ప్రారంభమైందన్నారు.

తప్పుడు ఆరోపణలతో తనని బయటకు పంపారని చెప్పారు. ప్రలోభాలకు లొంగలేదనే నిందలు వేస్తున్నారని తెలిపారు.

మొత్తం వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్‌ చేశారు.