

రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన బీర్ల
–కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత
గుండాల సాక్షి మాజీ రిపోర్టర్ సిరిపురం రాములు మృతి చెందగా కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య సోమవారం రాములు మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు.రాములు రిపోర్టర్ గా పనిచేస్తున్న సంస్థ పట్టించుకోక పోవడంతో అయిలన్న దాతృత్వాన్ని చాటుకున్నారు.అయిలన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఆలేరు నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈరసరపు యాదగిరి,మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.