పండ్లు ఫలాలతో… వానరాల ఆకలి తీర్చిన జానకీ రాముడు

0
148

యాదాద్రిలో లాక్డౌన్ తో ఆకలి మీదున్న వానరాల కడుపు నింపిన పోలీసన్న
…..
. వానరాలకు అరటి పండ్లను అందించిన యాదగిరిగుట్ట సీఐ జానకిరెడ్డి పై ప్రశంసలు

గుట్ట సీఐ దాతృత్వం పై ప్రశంసల జల్లులు

అనునిత్యం బిజీ గా ఉండే గుట్ట సీఐ జానకి రెడ్డిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడని నిరూపించే సన్నివేశం ఇది….వివరాలు ఏమిటాని ఆసక్తికరంగా ఉంది కదా వివరాల్లోకి వెళ్దాం పదండి…..!!

యాదాద్రిలో వానరాలకు పండ్లు…ఫలాలు అందజేస్తున్న గుట్ట టౌన్ సీఐ జానకీరెడ్డి


ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులు లేక వెల వెల పోతున్నది. గతంలో భక్తులు అందించే ఆహారంతో ఆకలిని తీర్చుకునే వానరాలు ( కోతులు ).. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ మూగజీవాల వేదనను చూసి యాదగిరిగుట్ట టౌన్ సీఐ జానకిరెడ్డి గారు చలించిపోయారు. ఈ విషయాన్ని సీఐ హైదరాబాద్లోని కొత్తపేట వాసవీకాలనీ చెందిన తన సోదరుడు చిలుక ఉపేందర్ రెడ్డి గారికి తెలుపగా, ఆయన సుమారు 7 ట్రేల అరటిపండ్లను పంపించారు. ఈ సందర్భంగా సీఐ జానకిరెడ్డి గారు స్వయంగా వానరాలకు అరటిపండ్లను అందించారు. మూగ జీవుల ఆకలిని తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు.. మూగజీవాలకు దాతలు తమకు తోచిన సాయాన్ని.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.