ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలి…. హమీద్ పాషా

0
31

కేంద్ర ప్రభుత్వానికి దళిత బహుజన ఆదివాసి మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ను కరెన్సీ నోట్లపై ముద్రించాలని సామాజిక చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శేక్ హమీద్ పాశ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను (23వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో దళిత బహుజన ఆదివాసి మైనారిటీల పట్ల ప్రభుత్వం కపట ప్రేమ చూపెడుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కు కృషి చేసిన అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించుటకు ఎందుకు ఆలస్యం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ జ్ఞానమాల కార్యక్రమంలో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ సర్పంచ్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి చిన్న కృష్ణారెడ్డి, సాధన సమితి జిల్లా నాయకులు ఇటుకల దేవేందర్, బొడ్డు కృష్ణ, అందె నరేష్, బబ్లూ, కబీర్, చిలివేరు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి లో జ్ఞానమాలను సమర్పిస్తున్న హమీద్ పాషా