పబ్లిక్ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ,అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం ఏసీబీ ,ఇతర అవినీతి నిరోధక సంస్థలచే దాడులు చేయిస్తున్నట్టే ప్రజాప్రతినిధుల కూడబెట్టుకున్న ఆస్తులపై దాడులు నిర్వహించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .
ప్రభుత్వ ఉద్యోగి తన ముప్పది ఏళ్ల ఉద్యోగ కాలంలో జీత భత్యాలతో ఏడాది కుటుంబ ఖర్చులు పోను మిగిలినది వారు కూడబెట్టుకున్న స్థిర ,చరా ఆస్తులు ఉండడంలో తప్పు లేదు .ఇదిఒక భాగం అయితే !ప్రజా అవసరాలకోసం కార్యాలయ పనులకోసం వచ్చే ప్రజా అవసరాలకు ధరల పట్టికతో సొమ్ము లాగడం అవినీతి కిందకు వస్తుంది దీన్ని కట్టడి చేయాల్సిందే ?ఇదే సమయంలో ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన నాటి అయన ఆస్తిపాస్తులు ఏమిటి ?పదవి దిగిన తర్వాత అయన ఆస్తులు ఎంత ?అన్నది ప్రభుత్యం వెలికితీసిందా !అని ప్రజలు డిమాండ్ చేయడంలో అర్థం ఉంది .
ఇప్పటివరకు అవినీతి నిరోధక సంస్థల దాడుల్లో ప్రాథమిక దర్యాప్తు సందర్భంలోనే అవినీతికి పాల్పడిన ఉద్యోగులు కొంత కాలం జైలు నిర్బంధం ,ఆ తరువాత సెస్పెన్షన్ ఈ సస్పెన్షన్ కాలంలో ఆ ఉద్యోగులు వారి వేతనంలో సగం పొందవచ్చు .చివరకు ఆ కేసులనుంచి “క్లిన్ “చిట్ తో బయటపడ్డా వారు ఎందరో …!
సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు అని దాడుల్లో భూ డాక్యూఎమెంట్లు ,బంగారు వెండి నగలు కిలోలకొద్దీ ,నగదు ,బినామీ ఆస్తులని చిట్టా !అధికారులు వెల్లడిస్తారు ?అయితే !ఇలా లభ్యమైన అక్రమ సొమ్ము పాలకులు చట్ట సభల్లో వెల్లడించారా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ?ఉద్యోగుల సంగతి ఇలావుంటే !ప్రజాప్రతినిదుల విషయానికి వస్తే వాళ్ళు వచ్చింది ప్రజా సేవకోసం అయినా ప్రజలు వారిసేవ సమయానికి జీతభత్యాలు ప్రజాధనం నుంచి ఇస్తున్నారు. ఇది భాగానే ఉన్న !ముప్పది ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగులలో కొన్ని శాఖలకు పెన్షషన్ లేదు !కొందరికి ఉంది కానీ పాలకులు ఈ పెన్షషన్ విధానమునకు స్వస్తి పలకాలని పాచికలు కదుపుతుంది .సరే పనిచేసిన రోజులకు జీతభత్యాలు ఇవ్వడం న్యాయ సమ్మతం అంటున్నా పాలకులు మరి పార్లమెంట్ ,శాసన సభ్యులకు ,చేతికి అదనపు వేలుగా ఉన్న మండలి సభ్యులకు ప్రజాప్రతినిధిగా కొనసాగితేనే పెన్సషన్ ఇవ్వడం ఏ మేరకు న్యాయసమ్మతమో ?ఒక పర్యాయం చేసిన సభ్యులకు కూడా వారిజీవితకాలం ,అయన తదనంతరం సతీమణి జీవితకాలం అన్ని వసతులతో కూడిన పెన్షషన్ ఇవ్వడం పై పాలకులు ప్రజలకు జవాబు చెప్పాల్సివుంది .
ఇదిలావుంటే !ప్రజా ప్రతినిధులు వారికీ కేటాయించిన నియోజక అభివృద్ధి నిధుల తో చేపట్టే పనులకు కమిషన్లు ,ఆ తరువాత సంబంధిత అధికారుల నొక్కుడూ ..ఇక కాంట్రాక్టర్ ఏమైనా మిగులు లేకుంటే !నష్టంతో నాణ్యత లేని పనులు చేసి ప్రజాఖజానాకు తూట్లు పొడవడం పరిపాటైంది అనడం అతిశయోక్తి కాదేమో !ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి .ఒకటి మచ్చుతునక గత పాలకులు చేపట్టిన ప్రాజెక్టులైన ,పేదల ఇల్లైనా !అసంపూర్తిగా వదిలివేసి నూతన డిజైన్ల పేరుతో నిర్మాణాలు చేయడం ఎంతవరకు సబబు .పాతపనులు నేడు ఉత్సవ విగ్రహాల పడి ఉంటున్నాయి అంటే ?రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నది సామెత అయితే !నేడు ప్రజల సొమ్ము పెంటపాలు అన్న చందంలా !తయారైంది అనే విమర్శలు వున్నాయి .ప్రజాప్రతినిదులు నిధుల కేటాయింపు లో .పైరవీలతో దోచుకొని కోట్లకు పడగెత్తిన వారి అక్రమ ఆస్తుల కూడబెట్టడాలపై దాడులు ఉండవు !కట్టడికి చర్యలు ఉండవు ?మరి ఈ అవినీతికి ఎలా శుభం కార్డు పడుతుంది అనే మీమాంస ప్రజల్లో తొలుస్తున్న ప్రశ్నా ?
దీనికి ఒక్కటే !పరిష్కారం ఓటర్ ఎప్పుడైతే తన ఓటును అమ్ముకోడో ..నిబద్ధతా గల ప్రజాప్రతినిధులు ఎన్నికావుతారు అప్పుడు వారిని ఓటర్లు అన్ని సందర్భాలలో నిలదీయవచ్చు .
పెన్షన్ చెల్లింపు విధానం అన్ని రంగాలకు రద్దు చేయాలి ,అవినీతితో ఉద్యుగులు ,ప్రజాప్రతినిదులు సంపాదనకు మించి కూడబెట్టితే !బేషరతుగా చట్టసభల్లో బహిరంగ పర్చాలి ,ఉద్యోగులు ,ప్రజాప్రతినిధులు అవితికి పరులు అని రుజువుకు చట్టంలో లొసుగులు లేకుండా చట్టం ఉండాలి ,
ఉద్యోగులు అవినతి పరులని రుజువైతే శిక్షా అర్హులు అయినపుడు ప్రజాప్రతినిదులకు కూడా ఆ చట్టం వర్తిస్తుంది .ఇలాంటి అవినీతి పరులకు ఏ ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేకుండా చట్టం రావాలి.
ఇలా జరిగితే ప్రజాధనం దోపిడీకి గురి కాకా అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతాయి .అధికార దాహలో రాజకీయనాయకుల జనాకర్షణ పథకాలతో ప్రజలు సోమరిపోతులుగా మారకుండా అవుతారు .ఉత్పాదక రంగాలు అభివృద్ధి జరుగుతాయి
అని ప్రజల్లో సర్వత్రా డిమాండ్ వస్తుంది .