ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆపత్కాల సహాయాన్ని విడుదల చేయాలి .

0
57

హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి

ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆపత్కాల సహాయాన్ని విడుదల చేయాలని ట్రాస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి …సాధుల మధుసూదన్ రావు లు కోరారు….


కరోనా దెబ్బతో కార్యకలాపాలు నిలిచిపోయిన ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పూట గడవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సిబ్బందికి నెలకు రెండు వేల రూపాయలతో పాటు ప్రతి నెల 25 కిలోల బియ్యాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించి అండగా నిలిచారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా విద్యా వ్యవస్థ పూర్తిగా రోడ్డున పడిందని దీనిపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది జీవితాలు అతలాకుతలమై అల్లాడిపోతున్నారు అని శేఖర్ రావు అన్నారు.
ఈ ఆర్థిక సహాయం పైన ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నారని, ఈ ఆపత్కాల సహాయమే ప్రస్తుతం వారికి ఇదే జీవనాధారమని తెలియజేస్తూ నిలిచిపోయిన ఆపత్కాల సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి,ఆర్థిక శాఖ మరియు విద్యా శాఖాధికారులకు పత్రికా ముఖంగా వారికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో వీరికి వేరే ఇతర రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు దొరకడం లేదన్న విషయాన్ని అందరూ గమనించాలని కోరారు.
అంతేకాకుండా ఈ ఆపత్కాల సహాయాన్ని పాఠశాలలు భౌతికంగా పునః ప్రారంభం అయ్యే అంతవరకు ప్రతినెల లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని ఒక పత్రికా ప్రకటనలో యాదగిరి శేఖర్ రావు మరియు
ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గారు, రాష్ట్ర కోశాధికారి ఐవి రమణ రావు గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంయుక్త ప్రకటనలో కోరారు