యాదాద్రి ప్రతినిధి
నిర్విరామంగా….
నిరాటంకంగా ….
నాలుగు గంటలు…
40 కిలోమీటర్ల మేర….
కాలువగట్ల మీద పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి
ఇరిగేషన్ ఇ యన్ సి తో సహా ఉన్నతాధికారుల హాజరు
బసవపూర్ రిజర్వాయర్ వద్దనే అధికారులతో సమీక్ష
పాల్గొన్న జిల్లా కలెక్టర్
సీఎం సూచనలతో పనుల వేగిరానికి మంత్రి జగదీష్ కసరత్తు
భువనగిరి, ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించబడిన బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్ నిర్మాణపు పనుల వేగవంతానికి గాను ప్రత్యేక కార్యాచరణ ను రూపొందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రంగంలోకి దిగిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బుధవారం సాయంత్రం బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న చోటనే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.అంతకు ముందు ఆయన ప్యాకేజ్14&15పనులు జరుగుతున్న 40 కిలోమీటర్ల మేర ఆసాంతం కాలువగట్ల మీద ప్రయాణించి పనుల పురోగతిని పర్యవేక్షించారు.14&15 ప్యాకేజి జంక్షన్ నుండి కొడకండ్ల,తిగుళ్ల,జగదేవ్ పూర్,వీరారెడ్డి పల్లి ,తుర్కపల్లి,మొలకపల్లి ,జంగంపల్లి మీదుగా కాలువగట్ల నిర్మాణాలతో పాటు లైనింగ్ నిర్మాణాలను పరిశీలిస్తూ సాయంత్రానికి బస్వాపూర్ కు చేరుకున్నారు.మల్లన్నసాగర్ నుండి విడుదలవుతున్న నీరు ప్యాకేజ్ 15&16 ల పరిధిలో 36 కిలోమీటర్ల మేర డిజైన్ చేయబడిన గందమళ్లకు చేరుకుని 2,450 క్యూసెక్కుల నీరు చేరుకుంటాయి.అంతే గాకుండా జగదేవ్ పూర్ వద్ద డిస్ట్రిబ్యూషన్ కేనాల్స్ నుండి 6,467 ఎకరాల ఆయకట్టుకు,ఎల్ యం సి నుండి 37,814 ఎకరాలు,ఆర్ యం సి నుండి 19,019 ఎకరాల ఆయకట్టుకు నీరు పారేలా డిజైన్ చేసిన విషయం విదితమే .ఈ క్రమంలోనే కోటి ఎకరాల మాగణం టార్గెట్ గా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ లో చేసిన సమీక్ష లో ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉండొద్దు అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తో పాటు సమన్వయం చేసుకోవాలంటూ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో నే బుధవారం మధ్యాహ్నం రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,భోనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇరిగేషన్ ఇ యన్ సి మురళీధర్ రావు,


