బిజినెస్ జనతా పార్టీగా బీజేపీ.డాక్టర్ శ్రావణ్

0
63

1. బిజెపి… బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది. కరోనా కష్ట కాలంలోనూ పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్. పెరిగిన పెట్రోల్ డీజల్ ధరలు సామాన్యుడి పై గుదిబండ. వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోండి : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్

  1. ”ప్రజల చెవిలో ప్రధాని పువ్వు” కాంగ్రెస్ వినూత్న నిరసన. ప్రజల జీవితాలతో మోడీ చలగాటం. ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన. ప్రజలని లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండా. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్ ప్లాన్.
  2. ఆదాయంలో పెట్రోల్, డీజిల్ సహజ వాయువుపై వసూలు చేసిన పన్నులు 2014-15లో 5.4 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి 12.2 శాతానికి పెరిగాయి. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 2014 లో లీటరుకు రూ 9.48 వుంటే.. ఇప్పుడు రూ. 32.90 కు పెంచారు. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, శ్రీలంక లాంటి దేశంలో కూడా మన కంటే పెట్రోల్, డీజల్ ధరలు తక్కువ.
  3. గత ఏడేళ్ళుగా పెట్రోల్ డీజల్ ధరల రూపంలో రూ. 25లక్షల కోట్లు దండుకున్నారు. గత రెండు నెలల్లోనే పెట్రోల్ డీజల్ ధరలు 25 సార్లు పెంచారు. ప్రజల నుండి దోచుకున్న డబ్బు ఎక్కడి వెళ్ళింది ? దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుంది ?

11.06.2021. HYD

”భారతీయ జనతా పార్టీ… బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుందని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఏఐసీసీ ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో బాగంగా ”ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని” అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ”మోడీ సర్కార్ కేవలం వ్యాపార మనస్తత్వంతో నడుస్తుంది. క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు సహజంగానే పెట్రోల్ ధర తగ్గాలి. కానీ పెట్రోల్ ధర ఆకాశానికి తాకుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటించేశారు. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజల రక్తాన్ని తాగేయాలనే రాక్షస ఆలోచనతో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది” అని విమర్శించారు.

”గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయిలు దండుకున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుంది” అని ప్రశ్నించిన దాసోజు.. మోడీ సర్కార్ ఈ దోపిడీ మనస్తత్వాన్ని వీడి, కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలి. వెంటనే పెట్రోల్ డీజల్ గ్యాస్ ధరలు తగ్గించాలని” డిమాండ్ చేశారు దాసోజు

”పెట్రోల్ ధర పై సామాన్యుడి బ్రతుకు చట్రం ఆధారపడి వుంటుంది. రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇలా అన్నీ వర్గాల ప్రజలపై పెరిగిన పెట్రోల్ ధర ఓ గుదిబండ. పెట్రోల్ ధర పెరిగితే అన్నీ ధరలు పెరిగిపోతాయి. బస్సులో ప్రయాణించాలన్నా.. పండించిన ఆహార ధాన్యాలు రవాణా చేయలన్నా.. నిత్యావసర వస్తువులు.. ఇలా అన్నిటిపై పెట్రోల్ ధర ప్రభావం పడుతుంది. ప్రజల కష్టకాలంలో వున్నారు. వ్యాపార ధోరణి వీడి .. దయచేసి పెరిగిన పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలని వెంటనే తగ్గించండి. కష్ట కాలంలో వున్న ప్రజల కు స్వాంతన కల్పించండి” అని కోరారు దాసోజు.

”మోడీ సర్కార్ లూటీకి హద్దులేకుండా పోతుంది. ప్రజలని దోచుకుని తినేయాలనే ఆలోచన దుర్మార్గం. మొత్తం ఆదాయంలో పెట్రోల్, డీజిల్ సహజ వాయువుపై వసూలు చేసిన పన్నులు 2014-15లో 5.4 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి 12.2 శాతానికి పెరిగాయి. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 2014 లో లీటరుకు రూ 9.48 వుంటే.. ఇప్పుడు రూ. 32.90 కు పెంచారు. ఇదే సమయంలో డీజిల్‌ కూడా లీటరు రూ3.56 నుంచి రూ. 31.80 కు పెరిగింది. కేవలం గత రెండు నెలల్లోనే పెట్రోల్, డీజల్ ధరలు 25 సార్లు పెంచారు” అని పేర్కొన్నారు దాసోజు.

”బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, శ్రీలంక లాంటి దేశంలో కూడా మనకంటే పెట్రోల్, డీజల్ ధరలు తక్కువ వున్నాయి. జీడీపీలో కూడా మన కంటే మెరుగ్గా వున్నాయి. కానీ దేశాన్ని సూపర్ పవర్ గా మార్చుతానని ప్రగల్భాలు పలికిన మోడీ.. దేశాన్ని వెనక్కి నెట్టారు. ఈ వెనకబాటుతనం, అసమర్ధ పాలన, దోపిడీని ఆపాలంటే మోడీ సర్కార్ ని గద్దె దించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, మోడీ మెడలు వంచైనా పెట్రోల్ డీజల్ ధరలు తగ్గిస్తాం” అని వెల్లడించారు దాసోజు.