కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఆరు రోజుల క్రితం బెంగళూరులోని ఎన్‌ఆర్ఐ కాలనీలో 22 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. మరో దురదృష్టకర పరిణామం ఏంటంటే.. ఆ నలుగురి యువకులు గ్యాంగ్‌రేప్ చేస్తున్న సమయంలో ఓ యువతి వారికి సహకరించింది. ఆ నలుగురు యువకులు, ఆ యువతి బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చి అక్రమంగా నివాసముంటున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు, వారు గత కొంతకాలంగా బెంగళూరు నగరంలో ముఠాగా ఏర్పడి వ్యభిచారం చేస్తున్నట్లు తెలిసింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన యువకులతో పాటు వారికి సహకరించిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా షేక్, రిదై బాబు, హకీల్‌గా పోలీసులు గుర్తించారు.
వీరంతా ఎన్‌ఆర్‌ఐ కాలనీలోనే నివాసముంటున్నట్టు పోలీసులు తేల్చారు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ 22 ఏళ్ల యువతిని తాము ఉంటున్న గదికి తీసుకెళ్లి నిందితులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ పైశాచిక ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో.. ఈ దారుణ ఘటన వెలుగులోకొచ్చింది.
బాధిత యువతి నాగాలాండ్‌కు చెందిన అమ్మాయిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత నాలుగైదు రోజులుగా బంగ్లాదేశ్, నాగాలాండ్ సోషల్ మీడియా పేజ్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమయింది. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని కూడా అస్సోం పోలీసులు ప్రకటించారు.
బాధిత యువతి నాగాలాండ్‌కు చెందిన అమ్మాయిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత నాలుగైదు రోజులుగా బంగ్లాదేశ్, నాగాలాండ్ సోషల్ మీడియా పేజ్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా వైరల్‌గా మారింది..
ఈ ఘటన అస్సోంలో జరిగిందని, కాదుకాదు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో యువతి ఆత్మహత్యకు.. ఈ ఘటనకు సంబంధం ఉందని ఇలా రకరకాల వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లు పోలీసులు గుర్తించారు..