మల్టీ జోనల్‌గా జడ్‌పీ పాఠశాలల హెచ్‌ఎం పోస్టులు

0
17

_సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం_*

హైదరాబాద్. రాష్ట్రంలోని జిల్లా పరిషత్తు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను కూడా మల్టీ జోనల్‌ పోస్టులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్‌ హెచ్‌ఎం పోస్టులను మల్టీ జోనల్‌గా పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. మండల, జిల్లా పరిషత్తులోని ఉపాధ్యాయులను జిల్లా కేడర్‌గా స్పష్టంచేసిన ప్రభుత్వం జడ్‌పీ హెచ్‌ఎం పోస్టులపై మాత్రం తేల్చలేదు. దీనిపై పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించాయి. ఈ క్రమంలో శుక్రవారం జారీ చేసిన 256 జీఓను సవరించి 257ను శనివారం విడుదల చేసింది._