
మీ రక్తం మాకు వద్దు కేసీఆర్, సీఎం కుర్చీ మాకు కావాలి, మమ్ములను మేమే అభివృధి చేసుకుంటామని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా శ్రవణ్ దాసోజు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
దాసోజు శ్రావణ్ సీఎం పై చేసిన ఆరోపణలు ఇవి.
👉దళితు ముఖ్యమంత్రి కోసం తల నరుక్కుంటా, దళితుల కోసం రక్తం దారబోస్తాను అనే రెండు మాటలు ఒకటే, మరోసారి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోకండి ?
👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను నెరవేర్చండి, రాజాకీయ సాధికారత శక్తినే, దళిత, గిరిజన, బహుజనుల అభివృద్ధికి తాళం
👉తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ నుంచి మొదలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి దాకా మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను సన్నాసులు, దద్దమ్మలు, మీ బతుకు చెడ అని, ఇలా ఏడేళ్లలో ఎన్నో బూతులు తిట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఇక సహించం
👉గత ఏడేళ్లుగా టిఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దళిత, గిరిజన, బహుజనులను మోసం చేస్తుండ్రు
👉గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు లేఖ రాయడం తీరు చూస్తుంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటా’ అన్న చందంగా ఉంది
👉టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గత ఏడేళ్లుగా వాడిన భాషపై మరియు ఇచ్చిన హామీలపై, ప్రజలను మోసం చేసిన తీరుపై మరియు మీ వైఫల్యాలపై రాహుల్ గాంధీ గారి సమక్షంలో చర్చకు సిద్ధమా?
👉ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే ప్రతిపక్షాలపై జర్నలిస్టులపై దాడులు చేసి కేసులు పెట్టడం ఏంటి ?
👉ప్రశ్నించే గొంతుక జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామిక చర్య
👉ప్రజల సమస్యలపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే దుర్యోధుని మాదిరిగా తొడలు కొట్టి దాడులు చేయడం ఇదెక్కడి పాలనా, ఇదెక్కడి ప్రజాస్వామ్యం ?
👉80వేల పుస్తకాలు చదువుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇదేనా మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నేర్పుతున్న సంస్కారం ?
👉అధికారంలో ఎవరూ శాశ్వతం కాదు, కేవలం ప్రజలు నిర్ణయాలు మాత్రమే శాశ్వతం మరియు విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే శాశ్వతం
👉నేడు విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా, దుర్మార్గంగా ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు
👉సబ్ ప్లాన్ కింద ఈ ఏడేళ్ళలో లక్ష 25వేల కోట్ల రూపాయల్లో 65వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టుండాలి. కానీ నిధులు కేటాయించకుండ, కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారు. మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటె, ఏకకాలంలో 65వేల కోట్లు రూపాయలు విడుదల చేసి వారికీ న్యాయం చేయండి ?
👉ఒక హుజురాబాద్ ఎన్నికల కోసమే 10వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి, అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగతా నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం చర్యనే కదా ?
👉టిఆర్ఎస్ పార్టీ గత ఏడేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా చెప్పండి ?
👉ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా నైతికత ఉంటే ఒక్కసారి మారువేషంలో పల్లెల్లోకి మరియు విశ్వవిద్యాలయాల్లోకి, నిరుద్యోగ యువత దగ్గరకు వెళ్లి మీ పాలన గురించి తెలుసుకోండి, ప్రజలు ఏవిధంగా మిమ్మల్ని తిడుతున్నారో తెలుస్తోంది?
👉ఎస్సీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం 9 లక్షల 15వేల 553మంది దళిత బిడ్డలు లోన్స్ కి అప్లయ్ చేస్తే కేవలం లక్ష మందికే లోన్స్ ఇచ్చారు, మీ రక్తాన్ని మాకు ధారబోయో అవసరం లేదు, మీకు నిజంగా నైతికత ఉంటే మిగిలిన 8 లక్షల మందికి వెంటనే లోన్స్ ఇవ్వండి
👉దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, నేడు దళిత బందుతో దళితులను మోసం చేస్తున్నాడు
👉రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ ల కోసం 22 లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం 20 వేల మంది కూడా ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిండ్రు
👉రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగా ఖాళీలు ఉన్నాయి, మీరు అవి వెంబడే భర్తీ చేస్తే దళిత, గిరిజనులకు 40 వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయి, అవి భర్తీ చేయండి ?
👉రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా 55వేల మంది ఉద్యోగులను తొలగించారు, అందులో 7051 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులను, 16,450 మంది విద్యా వాలంటరీలను, 21,200 మంది సాక్షర భారతి ఉద్యోగులను, రెండు వేల మంది పంచాయతీ కార్యదర్శులను మరియు 1600 వందల మంది నర్సులను ఉన్నారు. వీరందరూ దళిత, గిరిజన, బహుజన బిడ్డలే వీరందరికీ మీ రక్తం వద్దు, వీరికి ఉద్యోగాలు ఇవ్వండి
👉తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బహుజనులు అత్యధికంగా చదువుకునే విద్యాలయాలోని విద్యని, విశ్వవిద్యాలయాలను నాశనం చేసిండ్రు
👉ఐదువేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు, విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా, ఉద్యోగాల భర్తీ చేయకుండా నాశనం చేసిండ్రు
👉ప్రతి జిల్లా జిల్లా స్థాయిలో నిమ్స్ తరహాలో ప్రభుత్వం ఆస్పత్రి, ప్రతి నియోజకవర్గంలో 100బెడ్ల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 50 బెడ్లు ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పి, వైద్యాన్ని నాశనం చేసిండ్రు
👉తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు నిధులు కేటాయించకుండా వైద్యాన్ని నాశనం చేసిండ్రు
👉దళిత గిరిజన బహుజనులు అత్యధికంగా వాడుకునే విద్యను, వైద్యాన్ని నాశనం చేసి, అలాగే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తుండ్రు
👉మీరు దళిత బంధువు కాదు ముమ్మాటికి దళిత రా బంధువులే అవుతారు
👉నేడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించగానే కొంత మంది దళిత, గిరిజన, బహుజన అధికారులు గుర్తొచ్చారు, నిజంగా మీరు చర్చకు సిద్ధమా? ఎంతమంది ప్రభుత్వంలో దళిత, గిరిజన, బహుజన అధికారులు ఉన్నారు ?
👉అమరవీరుల త్యాగాలను మోసం చేసిన కేసీఆర్, 1500మంది చనిపోయారని నాడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన కేసీఆర్, నేడు ఎంత మంది అమరవీరులకు న్యాయం చేశారో చెప్పాలి?
👉సెక్రటేరియట్ ముందు నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం 1500మందిదా లేదా 500మందిదా అనే విషయం కెసిఆర్ బహిరంగంగా ప్రజలకు చెప్పాలి ?
👉తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిలో అత్యధికంగా దళిత, గిరిజన, బహుజనలే ఉన్నారు, వారందరినీ మోసం చేసిండ్రు మీరు
👉పార్టీ మారగానే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు,మరి ఎందుకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వలేదు ?
👉తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడి , కొట్లాడిన మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సర్ , కొండ లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంతచారి,బెల్లి లలిత గార్ల విగ్రహాలు ఎందుకు ట్యాంక్ బండ్ మీద పెట్టడం లేదు? తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని సినిమా వారి విగ్రహాలు మాత్రం పెడుతాని హామీలు ఇవ్వడం ఏంటి ?
👉ప్రజలకు పెన్షన్లు ఇస్తున్నాం, రైతుబంధు ఇస్తున్నాం, కల్యాణలక్ష్మి ఇస్తున్నామని మాటలతో మోసం చేస్తుండ్రు
👉ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే, తెలంగాణ పది జిల్లాలకు సరాసరిగా 24 వేల కోట్లు రూపాయాలతోనే, నిత్యావసర ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే ప్రజలకు 200 రూపాయల పింఛను, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి లక్షా 25 వేల రూపాయలు మరియు విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్మెంట్, కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ఇచ్చాం…నేడు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 2000 రూపాయల పింఛన్ ఇచ్చామని గొప్పలు మాట్లాడటం ఏంటి ?
👉కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాం, మీరు 7ఏళ్ల పాలనలో ఎన్ని ఇండ్లు నిర్మించారో చెప్పండి?
👉దళిత గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి మోసానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు శాంతియుత మార్గంలో సత్యాగ్రహ దళిత, గిరిజన దండోరా దీక్ష చేస్తుంటే వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అవుతుంది
దళితుల కోసం రక్తం దారపోస్త అని సీఎం కేసీఆర్ అంటున్నారు.
కేసీఆర్ రక్తం దళితులకు అవసరం లేదు.. మీ కుర్చీ ఇవ్వండి చాలు.
ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి చాలు.
తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత నాయకుడే సీఎంగా ఉంటారని లేకపోతే తల నరుకుంటా అని చెప్పి మాట తప్పారు.
దళితులకు బడ్జెట్లో మిగిలిపోయిన సబ్ ప్లాన్ నిధులు 65 వేల కోట్లు విడుదల చేయండి చాలు.
సీఎం కేసీఆర్ బూతు మాటలను ఇన్నాళ్లు భరించాం కానీ ఇక నుంచి సహించేది లేదు.
ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ మాట్లాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా..
ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారు.
తీన్మార్ మల్లన్న ను ఎందుకు అరెస్ట్ చేశారో తెల్వదు. ఎక్కడ పెట్టారో తెల్వదు.
2 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని.. వాటిని భర్తీ చేస్తే 40 వేల ఉద్యోగాలు దళితులకు వస్తాయి.
ఉద్యమకాలంలో 1200 మంది చనిపోతే.. 500 మందికే పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు.
తెలంగాణ కోసం చనిపోయిన వారికి విగ్రహాలు పెడతామని చడీచప్పుడు లేదు.
ఇకనైనా సీఎం కేసీఆర్ సభ్యత , సంస్కారం తోకూడిన రాజకీయాలు చేయాలి.
