
హైదరాబాద్:-రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యక్ష తరగతులపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
గురుకులాలు మినహా మిగత పాఠశాలల్లో రేపటి నుంచి ప్రత్యక్ష బోధన నిర్వహించాలని నిర్ణయించింది.
అలాగే ప్రత్యక్ష బోధనకు సంబంధించి విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టవద్దని విద్యాశాఖ ఆదేశించింది.
ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే తుది నిర్ణయమని వెల్లడించింది.
కాగా, రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని.. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 17 నెలల సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలలు తెరుచుకోనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో పాఠశాలలు తెరిచేందుకు సర్వం సిద్ధం చేసుకున్న బడ్జెట్ పాఠశాలల వ్యవహర్తలు పేరెంట్స్ కు తమ సిబ్బంది చే ఫోన్లలో సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు.
