యాదాద్రి జిల్లాలో పాఠశాలలు తెరిచేందుకు చైతన్య కసరత్తు !!

0
402
డీఈఓ చైతన్య జైని

పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు … చేయాల్సిన పనులు పురమాయించిన డీఈఓ చైతన్య

యాదాద్రి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు విద్యార్థులు రావడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్న డీఈఓ చైతన్య జైని

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ….

కరోన ఉధృతితో మూత పడిన పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడముతో యాదాద్రి జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని నడుం బిగించారు. గురువారం ఆమె జిల్లాలోని పలు పాఠశాలల్లో వసతుల కల్పనకు చేపడుతున్న పనులను పరిశీలించడముతో పాటు స్వయంగా ఎలాంటి చర్యలు చేపడితే కారోన దరి చేరకుండా ఉంటుందో ఉదహరిస్తూ ప్రధానోపాధ్యాయులు, మండల వైద్యాధికారులు, స్థానిక సంస్థలకు చెందిన అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి ఆలయ విస్తరణ వల్ల ఏర్పడిన సమస్యలకు పరిష్కారం చూపించారు. విద్యార్థులు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. రోడ్డు మార్గములో వచ్ఛిపోయే విద్యార్థుల కోసం ట్రాఫిక్ పోలీసుల సాయం కూడా తీసుకోవాలని సూచించారు. రోడ్డు దిగి స్కూల్ లోకి విద్యార్థులు వచ్చే విషయంలో ఉపాద్యాయులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా స్కూల్ ముగిసిన మీదట వెళ్లేందుకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆరోగ్య శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ఖచ్చితత్వం కూడిన సమాచారం ఇస్తూ సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. రెగ్యులర్గా పర్యవేక్షణ ఇప్పటి పరిస్థితుల్లో అవసరమని చెప్పారు. విద్యార్థులను కాపాడుకోవడం ఉపాద్యాయులపై ఉందన్నారు. శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలి…. ఎవరికైనా దగ్గు, జలుబు తదితర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించి సూచనలు చేయడముతో ప్రధానోపాధ్యాయుల్లో చలనం వచ్చింది. స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని ఉపయోగించుకునే విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం సెక్రెటరీ రంగరాజన్, గుట్ట ఎంఇఓ కృష్ణ , అండాలు ప్రాధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

*జాగ్రత్తలు తీసుకుంటాం…కారోన రాకుండా చూస్తాం. డీఈఓ

ఈ సందర్భంగా డీఈఓ చైతన్య జైని మాట్లాడుతూ
పాజిటివ్ తేలిన పాఠశాలలో వెంటనే శానిటేషన్ తో పాటు ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని సూచించి నట్టు తెలిపారు. ఆ మేరకు ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న పాఠశాలలు తమను సంప్రదిస్తే కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తామని వైద్యశాఖ వివరించింది. అదే విధంగా హాస్టళ్లు, రెసిడె నియల్ సంస్థలలోని విద్యార్థులకు లక్షణాలు ఉంటే, వారిని పీహెచీసీలకు తరలించే బాధ్యత ఆయా స్కూళ్ల వార్డెన్లు, ప్రిన్సిపల్స్ దేనని హెల్త్ ఆఫీసర్లు వెల్లడిం చారు. అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్లు అందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. మరోవైపు ఈ నెల 30 వరకు అన్ని స్కూళ్లను క్లీన్ చేయించాలని వైద్యశాఖ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సూచించారు. ప్రతీ పాఠశాల ప్రవేశంలో థర్మల్ స్క్రీనింగ్. శానిటే షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని స్కూళ్లకు ముందస్తు జాగ్రత్తలను వైద్యారోగ్యశాఖ వివ రించిందని తెలిపారు.