యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్

0
49

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి

బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ అనితరాంచంద్రన్..

యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు

ఆదివారం మండలంలోని గూడూరు, గొల్లగూడెం, బ్రహ్మణపల్లి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అనితరాంచంద్రన్ తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం భట్టుగూడెం గ్రామంలోని కాదంబరి రైస్ మిల్లును పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని నిర్వాహకులకు కమీషనర్ సూచించారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున 10 రోజుల్లోగా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల అధికారులు, వ్యవసాయ సంభందిత అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో మొత్తం 292 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు 30,125 మంది రైతుల నుంచి 2,55,383 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కమీషనర్ కు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ ఉపెందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపి కృష్ణ, పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు
పాల్గొన్నారు