రేపటి నుంచి బ్యాంకు పని వేళల్లో మార్పులు

0
41

హైదరాబాద్‌: తెలంగాణ పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది. అదే విధంగా 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.