- లాఠీ ఛార్జ్ పేదవాడిపై కాదు.. దమ్ముంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పై చేయండి : కేసీఆర్ సర్కార్ కి ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ సవాల్
- పేదవాడి పై కేసీఆర్ సర్కార్ కక్ష్య .. లాక్ డౌన్ నెపంతో సామాన్యులపై తమ ప్రతాపం చూపుతున్న పోలీసుల తీరు అమానుషం. కేసీఆర్ మెప్పు కోసం పోలీసుల అతి తగదు . పోలీసుల అమానుష ప్రవర్తన వల్ల జీవనోపాధి కోల్పోతున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు
- బలవంతుడుడికి ఓ న్యాయం .. బలహీనుడికి మరో న్యాయమా కేసీఆర్ ? మంత్రి కేటీఆర్ హెడ్ గా వున్న టాస్క్ ఫోర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడీ ఎందుకు అరికట్టడం లేదు ?
- జీవో 248 ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై వెంటనే చర్యలు తీసుకోండి
హైదరాబాద్, యాదాద్రి ప్రతినిధి –
” తెలంగాణలో లాక్ డౌన్ జీవోని ఉల్లఘిస్తున్నందుకు సామాన్య ప్రజల్ని విచక్షణ రాహిత్యంగా కొడుతున్నారు. మరి జీవో 248 ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎందుకు లాఠీ ఛార్జ్ చేయడం లేదు” అని ప్రశ్నించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. లాక్ డౌన్ నేపంతో పేద ప్రజలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం కక్ష్య తీర్చుకుంటుంది. విచక్షణ రాహిత్యంగా లాఠీ ఛార్జ్ లు జరిపించి రాక్షస ఆనందం పొందుతుందని విమర్శించిన దాసోజు.. తెలంగాణ లో లాక్ డౌన్ కక్షపూరితంగా అమలు జరుగుతుందని, రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలు రోడ్ల పై కనిపిస్తే చాలు విచక్షణ రాహిత్యంగా కొట్టి అమానుషంగా వ్యవహరిస్తున్నారని, జీవో లో మెడికల్, ఫుడ్ సప్లయ్, నిత్యవసర వస్తువుల రవాణకు మినహాయింపులు ఇచ్చారని, ఆ నియమాలని తుంగలో తొక్కి.. పాపం సామాన్య ప్రజలపై, మందుల కోసం బయటికి వచ్చిన వారిపై, వైద్య పరిక్షల కోసం రోడ్డుపైకి వచ్చిన వారిపై, ఫుడ్ డెలివరీ చేస్తున్న వారిపై ఎలాంటి విచక్షణ చూపకుండా దారుణంగా లాఠీ ఛార్జీలు చేయించి, మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
”లాక్ డౌన్ పెట్టడం మంచిదే. కానీ జీవోలో మినిహయింపు ఇచ్చిన వారిపై కూడా దాడి చేయడం దారుణం. ఆక్సిజన్ అందక పేద వాడే చనిపోతున్నాడు. ఇపుడు పొట్టకూటి కోసం బయటికి వచ్చిన పేదవాడిపై విచక్షణ రాహిత్యంగా దాడులు జరిగి నరకం చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇంత అమానుషంగా వ్యవహరించడం తగదు. సామాన్యులకు కూర్చుని తినడానికి కేసీఆర్ వున్నట్లు ఆస్తులు లేవు. బయటకి రాకపోతే పూటగడటమే కాదు కుటుంబం మొత్తం పస్తుళో వుండే పరిస్థితి. అలాంటి పేద వారిపై కనీస మానవత్వం చూపాలి తప్పితే లాఠీ ఛార్జీలు సమంజసం కాదు. కేసీఆర్ మెప్పు పొందడానికి పోలీసులు ఇలా అతి చేయడం తగదు” అని సూచించారు దాసోజు.
”లాక్ డౌన్ జీవో ని ఉల్లఘిస్తున్నందుకు సామాన్య ప్రజల్ని కొడుతున్నారు సరే .. మరి జీవో 248 ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎందుకు లాఠీ చార్జీ చేయడం లేదు. జీవో 248 ప్రకారం రొటీన్ వార్డ్ ఐసోలేషన్ కు రూ 4000, ఐసియూ కి రూ 7500, వెంటిలేటర్ తో కూడిన ఐసియూ కి రూ. 9000. పరీక్షలు , మందులతో సహా జీవో నిర్ణయించిన రేట్లు ఇవి. కానీ ఈ జీవో నాలుక గీచుకోవడానికి కూడా పనికి రావడం లేదు. జీవో 539 ప్రకారం ఆర్ టీ పీసిఆర్ టెస్ట్ రూ 500 గా నిర్ణయించారు . ఒక్కరు కూడా ఈ రేటుకి టెస్ట్ చేయడం లేదు. రెండు వేల రూపాయలకి ఎవరూ తగ్గించడం లేదు. కానీ మాస్క్ లేకపోతె వెయ్యి రూపాయిల జరిమానా అంటూ తెచ్చిన జీవో కింద రూ. 31కోట్లు వసూలు చేసినట్లు స్వయంగా డిజీపీ చెప్పారు. ఇదెక్కడి న్యాయం ? జీవో 248, జీవో 539 లెక్క చేయని ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోరు కానీ లాక్ డౌన్ ఉల్లఘించారని సామాన్యులని కొడతారు, బండ్లు సీజ్ చేస్తారు. సామాన్యుల దగ్గర కోట్ల రూపాయిలు ఫైన్ వసులూ చేస్తారు. బలవంతుడుకి ఒక న్యాయం, బలహీనుడుకి ఒక న్యాయమా ? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. మంత్రి కేటీఆర్ హెడ్ గా వున్న టాస్క్ ఫోర్స్ జీవో 248 ని ఉల్లంఘిస్తన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
మంత్రి కేటీఆర్, డీజీపీ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్ రైడ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ని అరికట్టాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
”దయచేసి ప్రభుత్వం, పోలీసులు మానవత్వంతో వ్యవహరించాలి. మీ ప్రతాపం పొట్టకూటి కోసం బయటికి వచ్చిన వారిపై కాదు.. ప్రజల డబ్బుని విచ్చలవిడిగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై చూపించండి. ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడీని అరికట్టండి. వారి దోపిడీ నుంచి పేద ప్రజలని రక్షించండి” అని కోరారు దాసోజు.
