విద్యార్థులు ప్రణాళికా బద్దంగా విద్యార్జన చేయాలి. SVN లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు

0
637
SVNలో కొలువుదీరిన సరస్వతీ అమ్మవారికి పూజలు చేస్తున్న పాఠశాల ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్, డైరెక్టర్ మాధురి

యాదాద్రి.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించడం ద్వారా నాణ్యమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని యాదగిరిగుట్ట శ్రీవిద్యానికేతన్ ఉన్నతపాఠశాలవ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ అన్నారు.సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా తమ పాఠశాల ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి క్యారెక్టర్ ను పెంపొందింప చేసుకొని ప్రణాళికాబద్ధంగా సాధించాలన్న కసితో ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థికి డెడికేషన్ అవసరమని వివరించారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశపడి పరీక్షల సమయంలో నిరాశ చెందకుండా మొదటినుంచి ఉపాధ్యాయుల యొక్క సూచనలు పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువలు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. పాఠశాల యాజమాన్యం పక్షాన ఉపాధ్యాయులకు నగదును అందజేసి సత్కరించారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు పేరెంట్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి.

ఉపాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా ఉపాద్యాయులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి ఉపాద్యాయులు యూసుఫ్,గీత, హరీష్,సాయితేజ, సాహితీ, దీపిక, నిఖిత, శ్రీధర్, పులగం నరేష్, అంకం శివ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.