ఉప్పల్ ప్రతినిధి, ఆగస్టు 18
సర్వాయి పాపన్న ఆశయాల సాధనతోనే బడుగుల జీవితాలలో వెలుగులు వస్తాయని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బుధవారం ఉప్పల్, చిలకానగర్ ,..భువనగిరి ల.లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకకు హాజరైన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ..ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ బడుగుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెర్దం భాస్కర్ గౌడ్ గారు, కార్పోరేటర్ సీస వెంకటేష్ గౌడ్ గారు మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.


