స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం. దాసోజు పిలుపు

0
61

ఎందరో పోరాటయోధుల త్యాగాలవల్ల సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉంది – 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా శ్రవణ్ దాసోజు.

హైదరాబాద్ , ఆగస్టు 15 : ఈనాడు ప్రజలంతా దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ.. స్వతంత్రంగా బ్రతుకుతున్నాం అంటే.. ఆనాడు ఎంతో మంది పోరాటయోధులు బ్రిటిష్ వారి ఫై పోరాటాలు చేసి దేశాన్ని కాపాడుకోవడం వల్లే. అయితే ఆలా ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం ..బ్రతకగలుగుతున్నాం. అందుకే ఈరోజు ఆలా పోరాటాలు .. ప్రాణత్యాగాలు చేసిన వారికీ శ్రద్ధాంజలు ఘటిస్తున్నాం అంటూ 75 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ డా శ్రవణ్ దాసోజు గారు అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి.. దేశ ప్రజలకు , కాంగ్రెస్ కార్యకర్తలకు , అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..”ఖైరతాబాద్ నియోకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..ఈరోజు మనం దేశంలో స్వేచ్ఛగా , స్వతంత్రంగా బ్రతుకుతున్నాం అంటే..ఆనాడు బ్రిటిష్ వారి ఫై పోరాటాలు చేసి దేశాన్ని కాపాడుకోవడం వల్లే. అయితే ఆలా ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం ..బ్రతకగలుగుతున్నాం. అందుకే ఈరోజు ఆలా పోరాటాలు .. ప్రాణత్యాగాలు చేసిన వారికీ శ్రద్ధాంజలు ఘటిస్తున్నాం”.

“మిత్రులారా ఈరోజు స్వాతంత్రం..జరుపుకోవడమే కాదు ..నిజమైన స్వాతంత్రం ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యంగా పరంగా పరిపాలన న్యాయబద్దంగా కొనసాగాలి. అందరికి సమానమైన న్యాయం జరగాలి. పేదవారికి అందరికి కూడా తిండి బట్ట ఇలా అన్ని ఉండాలి”.

స్వాతంత్ర పోరాటడంలోనూ..స్వాతంత్రనంతరం భారతదేశ అభివృద్ధిలోనూ కాంగ్రెస్ పార్టీ పాత్రనుకొనియాడుతూ, “ఆనాడు స్వాతంత్రం వచ్చే సమయంలో భారతదేశంలో ప్రజలకు తినడానికి తిండి , వేసుకోవడానికి బట్ట లేదు. ఆ సమయంలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రు యొక్క దూరదృష్టి కలిగిన నిర్ణయాల వల్ల ఈరోజు మనం 100 కు పైగా విదేశాలకు ఆహార ధాన్యాలనుండి సాఫ్ట్ వెర్ ఉత్పతులను ఎగుమతి చేసే స్థితికి వచ్చాం. ఇలా రావడానికి కారణం గత కొన్ని దశబ్దాలగా కాంగ్రెస్ పార్టీ చేసిన కృషినే.

కానీ ఇవాళ దుర్మార్గంగా రీతిలో దేశంలో , రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. ఇలాంటి దారుణమైన పాలనకు కాంగ్రెస్ కార్యకర్తలు చేరమగీతం పాడాలి. రానున్న రోజుల్లో కోట్లాది స్వత్రయోదుల త్యాగాల వల్ల సాదించుకున్న స్వత్రాన్ని కాపాడుకోవానికి కాంగ్రెస్ కార్యకర్తలే కాదు..దేశ ప్రజలందరూ ఉద్యమించాలి.

ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ప్రజలు , కాంగ్రెస్ కార్య కర్తలు ఎంతో కష్టపడి పనిచేయాలి. ఆలా పనిచేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చుకొని మన స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం..అని శ్రవణ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో టిపిసిసి సెక్రటరీలు మధుకర్ యాదవ్, మొహమ్మద్ తయార్,కురువ విజయ్ కుమార్, కేతూరి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు షేక్ షరీఫ్ , ఖైరతాబాద్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు ఇందిరా రావు, కాటూరి రమేష్, శ్రీనివాస్ యాదవ్, కమ్మరి వెంకటేష్ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.