లాక్ డౌన్ వల్ల గుట్ట గుడి దర్శనాలు ఈ నెల 12 నుంచి నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు…రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుచున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తేది.12-05-2021 బుధవారం నుండి తేది.21-05-2021 శుక్రవారం వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విదించినందున తేది. 12-05-2021 అనగా రేపు ఉదయం 10-00 గంటల నుండి భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనములు నిలుపుదల చేయడమైనది. శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యంలు ఆన్నియు అంతరంగికముగా నిర్వహిస్తామని యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు