శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి పురస్కరించుకొని ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. యాగ నిర్వహణకు మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ గీత ఆదేశాల మేరకు ఏ ఈ ఓ గజ్వేల్ రమేష్ బాబు శనివారం ప్రధానార్చకులు నల్లమ్ తీగల్ లక్ష్మీ నరసింహా చార్యతో సమావేశమయ్యారు. మండపంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు రమేష్ బాబు చెప్పారు.

