SVN లో సంబురంగా తరగతుల నిర్వహణ..మొదటి రోజు విద్యార్థుల్లో వెల్లువెత్తిన ఆనందం

0
804

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచనలు చేసిన ఉపాద్యాయులు

Back to School….విద్యార్థులకు స్వాగతం చెబుతున్న కరస్పాండెంట్ భాస్కర్ సర్, ప్రిన్సిపాల్ మాధురి మేడం

కరోనను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ విద్యార్థులు విద్యార్జన చేసే పరిస్థితులు SVN లో ఉన్నాయని SVN RESIDENTIAL HIGH SCHOOL కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్ అన్నారు. కరోన వల్ల 17 నెలల సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్వ నిర్ణయం…కోర్టు ఆదేశాలతో బుధవారం పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విధ్యర్డులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కరోనను సమర్ధవంతంగా ఎదుర్కొంటు విద్యార్జన చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులున్నారని చెప్పారు. SMS ( సానిటైజేషన్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

*సంబురంగా పాఠశాలకు హాజరైన చిన్నారులు*
కారోన నేపధ్యం ఉన్నప్పటికీ ఎంతో సంబురంగా విద్యార్థులు మొదటి రోజు హాజరయ్యారు. వచ్చిన వారు స్వల్పంగా ఉన్నప్పటికీ విద్యార్థుల ముఖాల్లో ఆనందం కనిపించింది.

హాండ్ సానిటైజ్ చేస్తున్న ఉపాద్యాయురాలు గీత

పాఠశాలలోకి వస్తున్న వారికి హాండ్ సానిటైజేషన్
పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు గేటు ముందే ఉపాధ్యాయులు హాండ్ సానిటైజేషన్ చేస్తున్నారు. పరిశుభ్రంగా పరిసరాలు ఉండటంతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో అవసరమని ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పారు

10 వ తరగతి క్లాస్ చెబుతున్న హరీష్ సర్

*తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్స్*
తరగతి గదుల్లో బెంచీకీ ఇద్దరు చొప్పున మాత్రమే కూర్చుండబెట్టి బోధన జరిగేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా సహకరించాలని అప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోగలుగుతామన్నారు.ఎవరికైనా దగ్గు, జలుబు తదితర సమస్యలు వస్తే వెంటనే తరగతి ఉపాధ్యాయులకు తెలియపర్చాలని ప్రిన్సిపాల్ మాధురి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యూసుఫ్, హరీష్, గీత, సాయితేజ, సాహితీ, శ్రీధర్, నిఖిత, దీపిక తదితరులు పాల్గొన్నారు.

ఆహ్లాదకరంగా తరగతి గదులు