శ్రీయాదాద్రి ప్రతినిధి :
అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అద్భుత శిల్ప కళాసౌరభాలతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తిరుమల స్థాయిలో అభివృద్ధికి యాదాద్రీశుని ఆలయాన్ని ఆధారశిల నుంచి శిఖరం వరకు ఒకే జాతికి చెందిన పటిష్టమైన కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. శిలలపై భాగవత, పురాణ ఇతిహాసాల దేవతామూర్తులకు శిల్పులు జీవం పోసిన శిల్పాలు, సుందరమైన కట్టడాలతో యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక నగరిగా రూపుదిద్దుకుంటోంది. అంతర్, బాహ్య ప్రాకారాలు, సప్తగోపురాలు, బంగారు శోభతో విమాన గోపురాల సముదాయంతో మహిమాన్వితమైన యాదాద్రి క్షేత్రం అటు ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రాచీన శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే రీతిలో చరిత్రలో ఓ కలికితురాయిగా నిలిచిపోనుంది. విశ్వనగరం హైద్రాబాద్‌కు చేరువలోని రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి అద్భుత శిల్ప కళా సౌరభారాలతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. విశాలమైన మాఢవీధులతో పాటు ఒకే రకమైన నల్లరాతి కృష్ణశిలలపై భాగవత, పురాణ ఇతిహాసాల దేవతామూర్తులకు శిల్పులు తమ శిలలతో జీవం పోసిన శిల్పాలతో అద్భుతమైన కట్టడాలతో యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక నగరిగా రూపుదిద్దుకుంటోంది. అంతర్, బాహ్య ప్రాకారాలు, సప్తగోపురాలు, బంగారు శోభతో విమానగోపురాల సముదాయంతో మహిమాన్వితమైన యాదాద్రి క్షేత్రం అటు ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఇటు రాజుల కాలం తర్వాత ప్రాచీన శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే రీతిలో చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకునేవిధంగా నిర్మాణం సాగుతోంది.


కృష్ణశిలం నిర్మాణం
దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుత శిల్పకళా సంపదలతో తిరుమల స్ధాయిలో అభివృద్ధికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని ఆధార శిల నుంచి శిఖరం వరకు ఒకే జాతికి చెందిన పటిష్టమైన నల్లరాతి కృష్ణశిలతో నిర్మాణం సాగిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఆధునిక నిర్మాణ రీతుల్లో సిమెంట్ వంటి సామాగ్రిని వినియోగించకుండా జనుము, కానుగ గింజలు, సున్నపురాయి, పటిక వంటి సంప్రదాయ పదార్థాలతో డంగుసున్నం వినియోగిస్తున్నారు. పటిష్టంగా ఉండేవిధంగా ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు స్తపతులు పేర్కొంటున్నారు.
