శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదాద్రికి ఈశాన్యభాగంలో సేకరించనున్న 150 ఎకరాలలో అత్యాధునిక వసతులతో బస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న పరిధి వచ్చే తరాలకు ఉపయోగపడేవిధంగా లేకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. బస్సుల సంఖ్య పెంచడం, యాదాద్రికి నాలుగు దిక్కుల ఉన్న రోడ్లు బస్‌స్టేషన్‌కు కలుపుతూ నిర్మాణం కానున్నాయి. ఈ భూములన్నీ గుట్టకు ఈశాన్యభాగంలోని యాదగిరిపల్లి పరిధిలోకి వస్తాయి. దీంతో యాదగిరిపల్లి అభివృద్ధి ఎవరు ఊహించనంతగా జరగనుంది. ఇక్కడే 50 ఎకరాలలో పోలీసు బెటాలియన్ కూడా ఏర్పాటు కానుంది.