‘కలలు కనడమే వీడి పని’

0
165

‘మిఠాయి’ ట్రైలర్‌ విడుదల
ప్రముఖ హాస్యనటులు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెడ్‌ యాంట్స్‌ బ్యానర్‌పై ప్రభాత్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘అప్పట్లో కలలు కనేవాడు ఒకడు ఉండేవాడు. కలలు కనడం తప్ప వాడికి ఇంకేం పని లేదు.’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రాహుల్‌, ప్రియదర్శి కలిసి చేసిన హంగామా, వారి ఫన్నీ డైలాగులు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ‘ఇది నిజంగా జరిగిన కథ. అని ఈ రోజుల్లో సినిమాలన్నీ చెప్పేది ఇదే కదా..’ అంటూ చివర్లో భూషణ్‌ అనే నటుడు చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. చివర్లో రాహుల్‌, ప్రియదర్శి దుబాయ్‌ షేక్‌ గెటప్స్‌ వేసుకోవడం, గాడిదపై కూర్చున్న రాహుల్‌ భయపడి పరిగెత్తడం, అతన్ని చూసి ప్రియదర్శి పరుగులంకించడం నవ్వులు పూయిస్తున్నాయి. నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.